Horoscope | బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదవీయోగం..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతితో పాటు ధనలాభాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో సహచరులతో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కలిసివచ్చే కాలం. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశముంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన యోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులకు వ్యాపారాభివృద్ధి, ధనలాభాలు ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వినయంగా వ్యవహరించండి. అధికారులతో, సహచరులతో ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశముంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలం.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అద్భుతమైన శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి, పదవీయోగం, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్థికంగా ఊహించని ధనలాభాలు అందుకుంటారు. లాభాలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనా ధోరణితో ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులను ఆకట్టుకుంటారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆశించిన ఫలితాల కోసం బాగా కష్టపడాలి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. కుటుంబ కలహాలు ఏర్పడకుండా కోపాన్ని అదుపు చేయండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి యోగాలున్నాయి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో శుభ యోగాలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంది. అనేక మార్గాల నుంచి ధనలాభాలు ఉంటాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.