Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు మ‌ట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది..!

Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు మ‌ట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. అత్యాశకు పోతే సమస్యల్లో చిక్కుకుంటారు. చట్టపరమైన కార్యకలాపాల నుండి దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. చట్టపరమైన, కోర్టుకి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. మొహమాటం వలన చిక్కుల్లో పడతారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి చెందుతారు. కొన్ని పరిస్థితులు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో చేసేపనులు సత్వర విజయాలనిస్తాయి. పరోపకార బుద్ధితో అందరి మన్ననలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందేంకు మరింత కష్టపడాలి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రద్ధ లోపిస్తుంది. కుటుంబ వివాదాలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకంగా కాకుండా చూసుకోండి. ఉద్యోగులు సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తిఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి. బుద్ధిబలంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులతో ఇబ్బంది కలుగుతుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి శుభసమయం నడుస్తోంది. మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది. విశేషమైన ఆర్థిక యోగం ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనుల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆత్మబలంతో పనిచేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆత్మ విశ్వాసం తగ్గకుండా చూసుకోండి.