Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Feb 22, 2026 7:09 AM IST
Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనులు ఉత్సాహంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు, పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక శుభ పరిణామం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దృఢ నిశ్చయంతో, మనోబలంతో లక్ష్యాలను సాధిస్తారు. మీరు చేసే ప్రతీ పనిలో పరిపూర్ణత ఉండాలని భావిస్తారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు గొప్ప శుభ యోగాలుంటాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది, పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఉండవచ్చు. మనోధైర్యంతో, సహనంగా వ్యవహరిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఇది పరీక్షాకాలం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలకడగా ఉండడం అవసరం. పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. పనిప్రదేశంలో వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ప్రయోగాలతో, నూతన విధానాలతో ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆకాశమే హద్దుగా సాగే మీ అభివృద్ధిలో సన్నిహితుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. వృత్తి పరంగా మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు పొందుతారు. ప్రారంభించిన పనుల్లో అపజయమన్నదే ఉండదు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరమైన ప్రయోజనాలు అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల ప్రశంసలు ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమయోచిత నిర్ణయాలు మేలు చేస్తాయి. పెద్దల ఆశీస్సులు, దైవబలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రారంభించిన పనులల్లో చిన్న చిన్న ఆటంకాలున్నప్పటికీ పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో కలుగుతున్న అపజయాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. కొత్త ప్రయత్నాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణాలలో ప్రమాదాలు ఉండవచ్చు కాబట్టి వాయిదా వేయండి. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి, ఉద్యోగులు నూతన బాధ్యతలు చేపడతారు. అధికార పరిధి విస్తరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభప్రదమైన వాతావరణం ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వ్యాపారులు కీలక పెట్టుబడుల విషయంలో విచక్షణతో వ్యవహరించాలి. ముందుచూపుతో అధిక ఖర్చులు, ఆర్థిక నష్టాలు నివారించవచ్చు. ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి నిర్ణయం వివేకంతో ఆలోచించి తీసుకోవాలి. అధికారులతో సౌమ్యంగా మాట్లాడాలి. శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల బంధుమిత్రులతో సంబంధాలు దృఢపడతాయి.