Lizards in Home | మీ ఇంట్లో బల్లుల బెడదా ఉందా..? ఈ మొక్కలుంటే అవి దెబ్బకు పరార్..!
Lizards in Home | ప్రతి ఇంట్లో బల్లులు( Lizards ) కామన్. ఆ బల్లులకు ఇల్లాలు( House Wife ) భయపడిపోతుంటుంది. అలా బల్లులకు భయపడేవారు.. ఇంట్లో ఈ ఐదు మొక్కలను ( Plants )పెంచుకుంటే.. వాటి బెడద నుంచి ఉపశమనం పొందొచ్చు.

Lizards in Home | ప్రతి ఇంట్లో బల్లులు( Lizards ) కామన్‌గా కనిపిస్తుంటాయి. వెంటిలేటర్లు, కిటికీలు, విద్యుత్ బల్బుల వద్ద బల్లులు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఇక కిచెన్( Kitchen )లోనూ బల్లులు ప్రత్యక్షమవుతుంటాయి. ఈ బల్లులకు గృహిణులు( House Wife ) భయపడిపోతుంటారు. దీంతో వాటిని ఇంటి బయటకు తరిమేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మొత్తానికి బల్లులను ఇంటి నుంచి బయటకు పంపించేస్తుంటారు. కానీ మళ్లీ అవి ఏదో రకంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. ఇలా నిత్యం బల్లుల బెడద ఎదుర్కొంటున్న వారు.. ఇంట్లో ఈ ఐదు మొక్కలను పెంచుకుంటే చాలు.. బల్లులు దెబ్బకు పరార్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కల వాసన బల్లులకు పడదట. మరి ఆ ఐదు మొక్కలేంటో తెలుసుకుందాం..
తులసి మొక్క( Tulasi Plant )
తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ తులసి ఎన్నో అద్భుత ఔషధ గుణాలను కలిగి ఉంది. ముఖ్యంగా తులసిలో మిథైల్ సిన్నమేట్, లినాలూల్ వంటి రసాయనాలు ఉంటాయి. తద్వారా వాటి నుంచి వచ్చే వాసన బల్లులకు పడదట. దాంతో ఇవి ఇంట్లోకి రాకుండా ఉంటాయట. అందుకే పెరట్లోనే కాకుండా ఇంట్లోనూ చిన్న కుండీలో ఒక తులసి మొక్కను పెంచుకోవడం బల్లులను తరిమికొట్టడానికి చాలా బాగా పని చేస్తుందంటున్నారు.
బంతి మొక్క( Marigold Plant )
చాలా మంది ఇళ్లలో విరివిగా పెంచే మొక్కలలో ఒకటి బంతి. ఇంటి అలంకరణ, దేవుడి పూజకు బంతిపూలను ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాదు.. బంతి మొక్కలు బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టడానికి తోడ్పడతాయట. ముఖ్యంగా బంతి పువ్వులో పైరెత్రిన్, ట్రాపెజియం అనే క్రిమిసంహారక మూలకాలుంటాయి. ఫలితంగా వాటి నుంచి వెలువడే ఘాటైన వాసన బల్లులకు పడదట. దాంతో బల్లులు ఇంటి నుంచి పారిపోతాయంటున్నారు నిపుణులు.
పుదీనా ( Mint )
వంటకాల రుచిని పెంచే పుదీనా కూడా బల్లులను తరిమికొట్టడానికి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుదీనా మొక్కలో మెంథాల్ అనే మూలకం ఉంటుంది. తద్వారా ఆ మొక్క ఆకుల నుంచి వెలువడే సువాసన బల్లులకు అస్సలు నచ్చదట. అందుకే ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోవడం ద్వారా బల్లుల బెడదను తగ్గించుకోవచ్చంటున్నారు.
లెమన్ గ్రాస్( Lemon Gross )
లెమన్ గ్రాస్ చూడటానికి సాధారణ గడ్డిలానే కనిపిస్తుంది. కానీ, ఇదొక ప్రత్యేక రకం. దీనిలో సిట్రోన్సెల్లా అనే ఒక రసాయనం ఉంటుంది. అదే నిమ్మగడ్డిగి ఒక ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది. అయితే, లెమన్‌గ్రాస్ నుంచి ఈ సువాసన బల్లులకు నచ్చదట. కాబట్టి మీరు ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం ద్వారా దాని నుంచి వచ్చే వాసనను తట్టుకోలేక బల్లుల అక్కడి నుంచి పారిపోతాయంటున్నారు నిపుణులు.
లావెండర్ మొక్క(Lavender Plant )
లావెండర్ మొక్క నుంచి మంచి సువాసన వస్తుంది. అందుకే ఈ మొక్కను పెర్ఫ్యూమ్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతేకాదు.. లావెండర్ మొక్క బల్లుల బెడదను నివారించడానికి చాలా బాగా తోడ్పడుతుందట. దీని నుంచి వచ్చే క్రిమినాశక లక్షణాల సువాసన బల్లులకు అస్సలు నచ్చదట.