విధాత:కృష్ణ,ఈ పదానికి చీకటిలో ఆశ/ఒక విశ్వాసం కలిగించే భావన అని అర్థం, అతను చాలా కష్ట సమయాల్లో జన్మించాడు, అన్ని సమస్యలతో పెరిగాడు – తెలియని చీకటిలో “కృష్ణ” గురించి తెలుసుకోవడానికి మనం ఈ శ్లోకం అర్థం చేసుకోవాలి
“ఛాయాయాం పారిజాతస్య హేమ(ఏక) సిఁహాసనోపరి,
ఆసీన మంబుద శ్యామ ఆయతాక్ష మలంకృతం
చంద్రా ననం చతర్బాహుం శ్రీ వత్సాఁకిత వక్షసాం,
రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణ మాశ్రయే”
జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలుస్తుంది ,ఈశ్లోకం లో తెలియని అంధకారం లో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలఁటె జ్ణానం ఎలా వ్రుద్ధి చేసుకోవాలి ,జ్ణాన సాధన ఎలా సాగాలి ,ఎలాంటి పద్దతి లో సాగాలి,ఎలాఁటి మానసిక గుణాలతో తెలుసుకోవాలి,నేర్చుకోవాలి అనే శోధన అనే సాధన కొనసాగాలి అనే వివరం ఈ శ్లోకం లో నిక్షిప్తం అయి ఉఁది .
రకరకాల నీడలు ( चायायाम-ఛాయాయాం) ఉన్న ఆలోచనా స్రవఁతి తొ తెలియని సమస్య ఆలొచిస్తూ ఉన్నప్పుడు,ఏ ఆలొచన తో పరిష్కారం ఇవ్వగలమో అన్ని కారణాల తొ ఉత్పన్నమయిన ఆలొచనలు ఒక్కొక్కటి పరిశీలించి ( పారి -జాతస్య – వేరు వేరుగా జనించిన ఆలొచనలు) ),
వీటిలొ ఒక్క కారణ సహితంగా ఉపయోగపడె ఒక్క ఆలొచన ను ఘనీభవించి ప్రాధాన్యత ఇచ్చి (మ(ఏక) సిఁహాసనోపరి ),
ఆ ఆలొచన ను ఒక సమయ కాల ,నియమిత అనురూప పరిస్థితిలొ పరిశీలించి నిర్మాణం చేసి (ఆసీన మంబుద శ్యామ ) ,
అమలు చేయబడిన మరియు క్రియాత్మక భావన ఒక ఉపయోగకరమైన నివేదిక శైలితో అలంకరించి అందరికి అర్థం అయ్యెలా క్రియాత్మక ఆలొచన పదతితొ ( ఆయతాక్ష – కఁడ్లకు కనిపించేలా మలంకృతం – అలంకరించి ) ,
నిర్మాణ సాధ్యంతొ తయారుచేసిన పరిష్కారాన్ని అఁదచేసె నివెదిక ను అన్ని ఆలొచనలు ఇచ్చే ప్రస్తావనల వెలుతురు లొ పరిశీలిఁచి,నాలుగు కొలతలతో సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని ( చంద్ర-రాత్రి పూట వెలుగు ఇచ్చే ప్రస్తావన, – )
చతుర్భాహుం-నాలుగు కొలతలు ( పోడవు,వెడల్పు,లోతు,కాలం కొలతలతొ) ) ,
ఒక సాధ్యం కాగల నమూనా,నివేదిక ఖర్చు ఎంత అవుతుంది పరిశీలించి ( శ్రీ వత్సాఁకిత వక్షసాం _లక్శ్మీదేవి వనరుల అవసరం/వినియోగం యొక్క సమీకరణం అందజేసె ఆలొచన)
ఈ పద్దతి లొ క్రమబద్దంగా ఒక పరిష్కార మార్గం క్రియాత్మకంగా చూపించడానికి మన ఆలోచన లొ వైఖరి ఎకలాఉఁటె సఁపూర్ణ పరిష్కారం అఁదిఁచగలమొ రుక్మిణి ,సత్యభామల వైఖరుల తో ప్రయత్నం చేయాలి.
ద్రుష్టి,నిబద్ధత, అంకితభావం, ఏకాగ్రత, నమ్మకం (రుక్మిణి -ఆలొచనా భావన
పట్టుదల, ఉత్సాహం, శారీరక దృఢత్వం, శక్తి,ఆత్మవిశ్వాసం(సత్యభామ- ఈ ఆలొచన లకు ప్రతీక)
రుక్మిణి ,సత్యభామల వైఖరుల తో ప్రయత్నం చేస్తె అంధకారం లొ చీకటీ లొ తెలియని విషయం కూడా మనకు స్పష్టంగా తెలుకోగలుగుతాం.