హనుమంతుని జన్మస్థలంపై త్వరలో సమగ్ర గ్రంథం

విధాత:పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాల్లో లోతైన అవగాహన కలిగిన పరిశోధకులు, పండితులు సమగ్ర పరిశోధన జరిపి అనేక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రే హనుమంతులవారి జన్మస్థలమని నిరూపించారు. ఈ అంశంపై జులై 30, 31వ తేదీల్లో అంతర్జాతీయ వెబినార్‌ నిర్వహించాం. దేశంలోని పలు ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు, నిష్ణాతులు పాల్గొన్నారు. వీరి సూచ‌న‌లు, స‌మాచారం ఆధారంగా దీనిపై త్వరలో సమగ్ర గ్రంథం ముద్రిస్తాం. జాపాలి తీర్థంలోని ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని టిటిడికి అప్ప‌గించాల‌ని దేవాదాయ శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు […]

హనుమంతుని జన్మస్థలంపై త్వరలో సమగ్ర గ్రంథం

విధాత:పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాల్లో లోతైన అవగాహన కలిగిన పరిశోధకులు, పండితులు సమగ్ర పరిశోధన జరిపి అనేక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రే హనుమంతులవారి జన్మస్థలమని నిరూపించారు. ఈ అంశంపై జులై 30, 31వ తేదీల్లో అంతర్జాతీయ వెబినార్‌ నిర్వహించాం. దేశంలోని పలు ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు, నిష్ణాతులు పాల్గొన్నారు. వీరి సూచ‌న‌లు, స‌మాచారం ఆధారంగా దీనిపై త్వరలో సమగ్ర గ్రంథం ముద్రిస్తాం. జాపాలి తీర్థంలోని ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని టిటిడికి అప్ప‌గించాల‌ని దేవాదాయ శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపాం. ఆకాశ‌గంగ‌లో ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం ఏర్పాటుతోపాటు థీమ్‌పార్క్ నిర్మిస్తాం.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను ఈ ఏడాది సెప్టెంబరు 14న ప్రారంభించి 2022 మే నెల నాటికి పూర్తి చేస్తాం.భక్తులకు యధావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుంది, స్వామివారి కైంకర్యాలు కల్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహిస్తారు.

అగ‌ర‌బ‌త్తీల త‌యారీ

టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌తో త‌యారుచేసిన అగ‌రుబ‌త్తీల‌ను ఆగ‌స్టు 15వ తేదీ నుండి తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులో ఉంచుతాం. బెంగ‌ళూరుకు చెందిన దర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఆరు బ్రాండ్ల‌తో ఈ అగ‌ర‌బ‌త్తీల‌ను త‌యారుచేసి అందిస్తుంది.

పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు

  • కోయంబ‌త్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మ‌శీ స‌హ‌కారంతో 4 నెల‌ల్లోపు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులైన స‌బ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీన‌ర్ లాంటి 15 ర‌కాల ఉత్ప‌త్తులను అందుబాటులోకి తీసుకువ‌స్తాం. వీటి త‌యారీకి తిరుప‌తి డిపిడ‌బ్ల్యు స్టోర్‌లోని భ‌వ‌నాల‌ను ఉప‌యోగించుకుంటాం. ఇందులో వచ్చే ఆదాయాన్ని దేశీయ గోజాతుల సంరక్షణకు వినియోగిస్తాం.

గో ఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం

శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండిరచిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా సమర్పించేందుకు చర్యలు చేపట్టాం.

టిటిడి ఆధ్వ‌ర్యంలోని తిరుమ‌ల‌, తిరుప‌తి, ప‌ల‌మ‌నేరు గోశాల‌ల‌ను సంప్ర‌దాయంగా, శాస్త్రీయంగా నిర్వ‌హించ‌డం కోసం నిష్ణాతులైన వారిని గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టు కో-ఆప్ష‌న్ స‌భ్యులుగా నియ‌మించుకుని వారి స‌హ‌కారం తీసుకుంటాం.

టిటిడి అవసరాలకు తగిన విధంగా గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ రైతులతో అనుసంధానం చేసుకుని టిటిడికి ప్ర‌తి ఏటా అవ‌స‌ర‌మ‌య్యే ఏడు వేల ట‌న్నుల శ‌న‌గ‌పప్పు కొనుగోలు చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యం.

  • తిరుప‌తి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో ప‌శువుల దాణా త‌యారీ ప్లాంట్‌, ప‌శువుల సంతాన ఉత్ప‌త్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయు చేసుకోవాల‌ని నిర్ణ‌యం.

తిరుమలలో పర్వదినాలు

ఆగస్టు 13వ తేదీ గరుడపంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణపౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై దర్శనమిస్తారు.ఆగస్టు 18 నుండి 20వ తేదీవరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 17న ఆంకురార్పణ నిర్వహిస్తారు.