Gundala Kona | నల్లమల్లలోని ఆ ‘గుండాల కోన’లో మునిగితే.. పిల్లలు పుట్టడం ఖాయం..!
Gundala Kona | పెళ్లైన ప్రతి జంట( Couple ) పిల్లలను కనాలని కలలు కంటోంది. చాలా మంది పిల్లలను( Childrens ) కంటారు. కానీ కొందరికి సంతానం కలగదు. అలాంటి దంపతులు సంతానం కోసం ఎన్నో పూజలు చేస్తుంటారు. అయితే పిల్లలు లేని దంపతులు నల్లమల్ల( Nallamalla )లోని గుండాల కోన( Gundala Kona )లో మునిగితే పిల్లలు పుట్టడం ఖాయమని భక్తుల( Devotees ) ప్రగాఢ విశ్వాసం.

Gundala Kona | యుక్త వయసు రాగానే పెళ్లి( Marriage ) చేసుకోవాలనే భావన ప్రతి అమ్మాయికి, అబ్బాయికి కలుగుతుంది. పెళ్లాయ్యక ఏడాదికో, రెండేండ్లకో పిల్లలను( Childrens ) కనాలని ప్లానింగ్ చేసుకుంటారు. ఈ క్రమంలో దంపతులు పిల్లలను కంటుంటారు. కానీ నూటిలో ఒక్కరికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సంతానం కలగదు. అలాంటి దంపతులు కంటికి కనిపించిన ప్రతి దేవుడికి( God ) నిత్యం పూజలు చేస్తూ.. తమకు సంతానం ప్రసాదించమని కోరుకుంటుంటారు. అలా పూజలు చేసిన దంపతులకు ఆ దేవుడు సంతానాన్ని ప్రసాదిస్తుంటాడు.
ఇక ఎన్ని దేవుళ్లను వేడుకున్నా సంతానం కలగని దంపతులకు.. ఈ గుండం( Gundam ) ఒక వరం లాంటింది. దట్టమైన నల్లమల్ల అడవుల్లో( Nallamalla Forest ) ఉన్న గుండాల కోన( Gundala Kona )లో దంపతులు మునిగి.. తమకు ఒక బిడ్డను ప్రసాదించండి అని వేడుకుంటే తప్పకుండా వారికి సంతానం కలుగుతుందని భక్తుల( Devotees ) నమ్మకం. మరి ఆ గుండాల కోన ఎక్కడుందో తెలుసుకుందాం.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh )లోని కడప జిల్లా( Kadapa District )లోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలో గుండాల ఈశ్వరుడు( Lord Parameshwara ) ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిట్వేలి మండలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాల కోన ఉంది. గుండాలకోనలోకి సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతుంది. గుండాల కోనలో వర్షాకాలంలోనేకాదు, వేసవికాలంలో కూడా నీరు పుష్కలంగా ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఈ గుండం లోతు చూసిన వారు లేరని స్థానికుల కథనం.
ఈ గుండాల కోనలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ ఉంటుంది. ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. గుహ ద్వారంలో భక్తులు పూజలు చేసి, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయలోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. సంతానం లేని మహిళలు ఈ గుండం సమీపంలోని వృక్షాలకు మొక్కుబడిగా ఊయలలు కడుతారు.
గుండాల కోన కర్కటేశ్వర స్వామిని దర్శించాలంటే ఎన్నో ప్రయాసలకోర్చి భక్తులు 8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కానీ దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘటనలు కూడా లేకపోలేదు. అందుకే భక్తులు అటవీ అధికారుల అనుమతి తీసుకుని వారి సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదని స్థానికులు చెబుతారు.