Arunachalam Giri Pradakshina | అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..? ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సిందే..!
Arunachalam Giri Pradakshina | కార్తీక మాసం( Karthika Masam ) నేపథ్యంలో అరుణాచలం భక్తులు( Devotees ) వెళ్తుంటారు. అక్కడ గిరి ప్రదక్షిణలు( Giri Pradakshina )చేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు. గిరి ప్రదక్షిణలు చేసే సమయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.

Arunachalam Giri Pradakshina | గిరివాళం అంటే పవిత్ర పర్వతాల ప్రదక్షిణ. వివిధ పర్వతాల ప్రదక్షిణలలో పవిత్రమైన అరుణాచల కొండలను ప్రదక్షిణ( Arunachalam Giri Pradakshina ) చేయడం పుణ్యకార్యంగా భావించి ఆ విధంగా చేయడం వల్ల మన జీవితంలో మంచి ఫలితాలు లభిస్తాయి. అరుణాచల కొండలను శివుని( Lord Shiva ) స్వరూపంగా భావిస్తారు. కాబట్టి కార్తీక మాసం( Karthika Masam )లో గిరిప్రదక్షిణలు చేయడం మంచిదని భావిస్తారు. అయితే గిరిప్రదక్షిణలు చేసే సమయంలో ఈ నియమాలు పాటించాలి.
గిరిప్రదక్షిణ సమయంలో పాటించాల్సిన నియమాలు..
- అరుణాచలం నగరం 8 దిక్కులు ఎనిమిది లింగాల కారణంగా ప్రత్యేకమైన అష్టభుజ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి.
- గిరి ప్రదక్షణం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 9 లోపు గిరిప్రదక్షణం చేయడం మంచిది.
- ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకెళ్లొద్దు.
- గిరిప్రదక్షిణం కోసం వెళ్లేటప్పుడు చిల్లర తీసుకెళ్లడం తప్పనిసరి.
- గిరి ప్రదక్షిణ ఎడమవైపు మాత్రమే చేయాలి. కుడివైపు సిద్ధులు దేవతలు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.
- మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఓ అరుణాచల శివ అని నామస్మరణ చేస్తూ వెళ్లాలి.
- గిరి ప్రదక్షిణ చేసే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం తప్పకుండా సందర్శించండి. జ్ఞాన మందిరంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
- వివాహం కాని వారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడుతారు. ఇలా చేయడం వల్ల వివాహం తప్పకుండా అవుతుందని నమ్మకం.
- సంతానం కలగని వారు కూడా ఆ చెట్టుకు తాడు కడుతారు. అనుకూల ఫలితం వస్తుందని నమ్మకం.
- అరుణాచలం పరమేశ్వరుడిని జ్యోతిర్లింగ స్వరూపం.. అందువల్ల గిరి ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు మహాశివుడికి ప్రదక్షిణ అని భక్తుల నమ్మకం.