శ‌నివారం రావిచెట్టును పూజిస్తే.. అప్పుల బాధ‌లు తొల‌గిపోతాయ‌ట‌..!

అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే శ‌నివారం రోజు శ‌ని దేవుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేయాల‌ని పండితులు సూచిస్తున్నారు. ఇక రావి చెట్టుకు పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అప్పుల నుంచి విముక్తి క‌లుగుతుంద‌ని చెబుతున్నారు.

శ‌నివారం రావిచెట్టును పూజిస్తే.. అప్పుల బాధ‌లు తొల‌గిపోతాయ‌ట‌..!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో అప్పులు ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో అప్పులు ప్రాణాల మీద‌కు వ‌స్తాయి. ఎంత క‌ష్ట‌ప‌డి సంపాదించినా కూడా అప్పుల పాల‌వుతూనే ఉంటాం. మ‌రి ఈ అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే శ‌నివారం రోజు శ‌ని దేవుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేయాల‌ని పండితులు సూచిస్తున్నారు. ఇక రావి చెట్టుకు పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అప్పుల నుంచి విముక్తి క‌లుగుతుంద‌ని చెబుతున్నారు. త‌ప్ప‌కుండా సంప‌ద‌, శ్రేయ‌స్సు క‌లుగుతుంద‌ని పండితులు సూచిస్తున్నారు. మ‌రి శ‌నివారం రావిచెట్టుకు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం..

​శ‌నివారం పొద్దున్నే లేచి, అభ్యంగ‌న స్నానం చేయాలి. ఆ త‌ర్వాత రావి చెట్టు వ‌ద్ద‌కు వెళ్లి నీరు పోయాలి. అనంత‌రం పాల‌లో చ‌క్కెర క‌లిపి చెట్టు మొద‌లు వ‌ద్ద పోయాలి. తర్వాత ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి దయ మీపై ఉంటుంది. ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.

రావి చెట్టుకు పూజ చేసిన అనంత‌రం ఈ ప‌నులు కూడా చేస్తే ఇంకా మంచింది. నల్ల కుక్క, నల్ల ఆవు, నల్ల పక్షి విత్తనాన్ని శనివారం ఉంచాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి క్రూరమైన దృష్ట తొలుగుతుంది. ఇదే సమయంలో పేదలకు, బీదవారికి సహాయం చేయాలి. ఇలా చేయడం ద్వారా చెడు వెళ్లిపోతోంది. ఎందుకంటే శని భగవానుడి పేదలను సూచిస్తాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటారు.

శనివారం రోజు మిరపకాయలను వాడకూడదు.. కారం కోసం వంటలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఏలినాటి శని తొలిగిపోతుంది.