Pawan Kalyan | కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన .. ప్ర‌త్యేక పూజ‌లు చేసిన డిప్యూటీ సీఎం

Pawan Kalyan |  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కోటప్పకొండ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు పవన్ కల్యాణ్ చేరుకోగా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఘాట్ మార్గం గుండా కొండపైకి వెళ్లిన పవన్ కల్యాణ్, రోడ్డుకు ఇరువైపులా నిలిచిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

  • By: sn |    movies |    Published on : Jan 22, 2026 1:35 PM IST
Pawan Kalyan |  కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన .. ప్ర‌త్యేక పూజ‌లు చేసిన డిప్యూటీ సీఎం

Pawan Kalyan |  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కోటప్పకొండ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు పవన్ కల్యాణ్ చేరుకోగా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఘాట్ మార్గం గుండా కొండపైకి వెళ్లిన పవన్ కల్యాణ్, రోడ్డుకు ఇరువైపులా నిలిచిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొండపైకి చేరుకున్న పవన్ కల్యాణ్ ప్రసిద్ధ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అర్చకులు, పండితుల నుంచి వేదాశీర్వచనం స్వీకరించారు.

భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం పవన్ కల్యాణ్ కొండ దిగువన కోటప్పకొండ–కొత్తపాలెం నూతన రహదారిని ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కోటప్పకొండలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. హెలిప్యాడ్, కొండపైన ఆలయం, పవన్ కల్యాణ్ ప్రయాణించే మార్గాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించి పర్యవేక్షణ చేపట్టారు. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ శ్రేణులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి పడకుండా కాపుకాస్తున్న జనసైనికులు, వీర మహిళలు, నాయకుల కృషి ప్రశంసనీయమని అన్నారు. పార్టీకి చెందిన కొందరు నాయకులతో భేటీ అయి సంస్థాగత అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఇటీవల వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించేందుకు కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వంటి అంశాలను కూడా పార్టీపై రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి తప్పుడు ప్రచారాలను పార్టీ తరఫున తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.రాజ్యాంగబద్ధంగా, ప్రజా సేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ ప్రయాణంలో తోడు నీడగా నిలుస్తున్న జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ప్రతిష్ఠను కాపాడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.