Dasara Festival | ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారా..? అయితే దసరా రోజున ఇలా చేయండి..!
Dasara Festival | ఆర్థిక సమస్యలతో( Financial Problems ) పాటు ఇతర సమస్యలతో బాధపడేవారు దసరా( Dasara ) రోజు కొన్ని పరిహారాలు చేస్తే ఎంతో శుభుప్రదమట. పరిహారాలు చేసిన వారికి జీవితాంతం డబ్బుకు( Money ) లోటు ఉండదట.

Dasara Festival | ఈ నెల 12వ తేదీన(శనివారం) విజయ దశమి( Vijaya Dashami ) అంటే దసరా పండుగ( Dasara Festival ) ను జరుపుకోనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరాను జరుపుకుంటారు. ఈ రోజున దుర్గాదేవి( Durga devi ) మహిషాసురుడిని సంహరించినట్లు చెబుతారు. అంతేకాకుండా శ్రీరాముడు( Sriramudu ) లంకాధీసుడు రావణుడిని సంహరించి రావణుడిని చెర నుండి సీతాదేవి( Seeta Devi )ని విడిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మొత్తానికి దసరా రోజున శుభకార్యాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మంచిదని హిందువులు భావిస్తారు. ఆర్థికంగా ఎదగాలనుకునే వారు దసరా రోజున ఈ పరిహారాలు చేస్తే.. జీవితంలో డబ్బుకు, సంతోషానికి లోటు ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
జమ్మి చెట్టు వద్ద దీపం వెలిగించడం..
దసరా రోజున జమ్మి చెట్టుకు పరిహారాలు చేయడం ఎన్నో రకాలు ప్రయోజనాలను చేకూరుస్తుందని పండితులు సూచిస్తున్నారు. జమ్మి చెట్టు లేదా మొక్క కింద దీపం వెలిగించడం ద్వారా న్యాయపరమైన విషయాల నుంచి ఉపశమనం పొందుతారట. అంతేకాదు అదృష్టం లభిస్తుందని నమ్మకం.
చీపురు దానం చేయడం శుభప్రదం..
దసరా పర్వదినాన చీపురు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పండుగ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించిన అనంతరం.. సమీపంలోని ఆలయానికి చీపురు దానం చేయండి. అంతే కాకుండా అపరాజిత పువ్వు అంటే శంఖం పువ్వుతో పూజించడం కూడా చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల మనిషి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.
పాలపిట్ట దర్శనం ఐశ్వర్యానికి సంకేతం..
దసరా అంటే విజయ దశమి రోజున నీలకంఠ పక్షిని అంటే పాల పిట్ట దర్శనం చాలా శుభప్రదంగా భావిస్తారు. దసరా రోజున ఈ పక్షిని చూస్తే ఐశ్వర్యం పెరుగుతుందని, జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం.
సుందరకాండ పఠించడం మరింత శుభప్రదం..
వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందడానికి దసరా రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సుందరకాండ పఠించడం శుభప్రదం. ఈరోజు సుందరకాండను పఠించడం ద్వారా జీవితంలో వచ్చే ప్రతి చెడును నివారిస్తుంది. అభివృద్ధి పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.