Dasara Festival | దసరా రోజున చీపురును దానం చేస్తే.. కోటీశ్వరులైపోతారట..!
Dasara Festival | దసరా పండుగ( Dasara Festival )అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ ఫెస్టివల్‌ను విజయదశమి( Vijaya Dashami ) అని కూడా పిలుస్తారు. అయితే ఎంతో ప్రాధాన్యత కలిగిన దసరా రోజున.. కొన్ని దానాలు చేయడం వల్ల ఆ ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా చీపురు( Broom )ను దానం చేయడంతో కోటీశ్వరులైపోతారట.

Dasara Festival | విజయదశమి( Vijaya Dashami ) అదేనండి దసరా( Dasara ) రోజున ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంలో ముగినిపోతారు. దేవుళ్లకు భక్తితో పూజలు చేస్తారు. అంతేకాదు ఆయుధ పూజ కూడా నిర్వహిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దసరా రోజున కొన్ని మంచి పనులు చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. విజయదశమి రోజున మీరు చేసే కొన్ని దానాల వల్ల మీ ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని, ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక లాభం కలుగుతుందట. ముఖ్యంగా చీపురు( Broom )ను దసరా రోజున దానం చేయడం వల్ల కోటీశ్వరులైపోతారని పండితులు విశ్వసిస్తున్నారు.
ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. దసరా రోజున కొత్త చీపురు కొని పేదవారికి దానం చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయట. చీపురు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఇక దసరా రోజున ఇంట్లో చతుర్ముఖ దీపం వెలిగించాలని చెబుతున్నారు.. ఈ దసరా రోజున ఇంటికి దక్షిణం వైపున దీపం వెలిగించడం వల్ల పూర్వీకులు, కుల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఇది ఇంట్లో మానసిక శాంతిని, కుటుంబ సామరస్యాన్ని పెంచుతుంది. ఈ చర్యలతో మీరు మీ జీవితంలో ఆనందం, శాంతిని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు.