Vastu Tips | ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. కోటీశ్వరులైపోతారట..!
Vastu Tips | చాలా మందికి మధ్య, దిగువ తరగతి కుటుంబాల ప్రజలు.. ఎప్పటికైనా తాము కోటీశ్వరులం( Millionaire ) కావాలని కలలు కంటుంటారు. అయితే అధి సాధ్యం కాదు. కానీ ఈ మూడు వస్తువులు మాత్రం మీ ఇంట్లో ఉంటే తప్పకుండా కోటీశ్వరులైపోతారు. మరి ఆ మూడు వస్తువులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Vastu Tips | కోటీశ్వరుడు( Millionaire ) అయిపోవాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఒక వేళ కోటీశ్వరుడు కావాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ.. తాము ఉంటున్న ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. కోటీశ్వరుడు కావడానికి వాస్తు కూడా ముఖ్యమే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే కొన్ని వస్తువుల వల్ల సానుకూల శక్తి పెంపొంది, సంపద సమకూరుతుంది. దీంతో ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది. తద్వారా కోట్లకు పడగలెత్తొచ్చు. అయితే ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో కనుక ఉంచితే తప్పకుండా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. మరి ఆ మూడు వస్తువులు ఏంటో ఈ కథనంలో చూద్దాం..
మనీ ప్లాంట్( Money Plant )

వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ ప్లాంట్‌ను అంత పవిత్రంగా కూడా చూస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచితే ఆ ఇంటికి సంపద, అదృష్టం, ఆనందాన్ని తెస్తుందని విశ్వసిస్తారు. మనీ ప్లాంట్ పెరిగే కొద్ది మన జీవితంలో పురోగతిని, ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది. ఇక వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇంటి బయట లేదా ఈశాన్య దిశలో ఉంచితే ప్రమాదం. ఈశాన్య దిశలో ఉంచితే ఆర్థిక కష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆగ్నేయ దిశలో ఉంచి.. ఆర్థికాభివృద్ధి సాధించండి.
లాఫింగ్ బుద్ధ( Laughing Buddha )

లాఫింగ్ బుద్ధ కూడా విజయానికి చిహ్నంగా భావిస్తారు. ఆనందం, అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది. ఈ లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. ఆర్థికంగా ఎదిగేందుకు కూడా తోడ్పాటును అందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. లాఫింగ్ బుద్ధను ఇంటి ప్రధాన ద్వారం వైపు చూస్తున్నట్లుగా ఏర్పాటు చేసుకుంటే కోటీశ్వరులై పోవచ్చు.
మనీ ఫ్రాగ్( Money Frog )

మనీ ఫ్రాగ్ అనేది సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి శుభ చిహ్నంగా భావిస్తారు. ఈ కప్ప ఇంటికి ఆర్థిక అవకాశాలు, నగదు ప్రవాహం, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం.. లాఫింగ్ బుద్ధ, మూడు కాళ్ల కప్ప రెండింటినీ ప్రధాన ద్వారం వైపు ఉంచాలి. తద్వారా సంపద ఇంటి లోపలికి ప్రవహిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram