Vastu Tips | ఈ నాలుగు వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే.. కోటీశ్వరులవ్వడం ఖాయం
Vastu Tips | ప్రతి ఒక్కరు తమ మనుగడ కొనసాగించేందుకు డబ్బు చాలా ముఖ్యం. కానీ ఈ డబ్బు( Money ) సరిపడ లేక చాలా మంది నానా అవస్థలు పడుతుంటారు. కానీ కాస్త శ్రద్ధ పెట్టి ఈ నాలుగు వస్తువులు మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు కోటీశ్వరులు( millionaire ) అయిపోవడం ఖాయం. మరి ఆ నాలుగు వస్తువులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Vastu Tips | ప్రతి ఒక్కరికి ఆర్థిక కష్టాలు( Financial Problems ) ఉంటాయి. కొందరు ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూ.. అప్పుల( Debts ) నుంచి విముక్తి పొందుతుంటారు. కొందరేమో ఆర్థిక క్రమశిక్షణకు దూరమై అప్పులు కుప్పలు కుప్పలుగా పోగేసుకుంటారు. ఇలా అప్పుల నుంచి విముక్తి పొంది కోటీశ్వరులు( millionaire ) కావాలంటే తప్పకుండా వాస్తు నియమాలు( Vastu Tips ) పాటించాలని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ నాలుగు వస్తువులను నాలుగు దిశల్లో ఇంట్లో పెట్టుకుంటే.. డబ్బు వద్దన్నా వస్తుందట. దాంతో ధనం గణనీయంగా పెరిగి కోటీశ్వరులైపోతారట. మరి ఆ నాలుగు వస్తువులు ఏంటి..? వాటిని ఏయే దిశల్లో పెట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దక్షిణ దిశలో..
మీ ఇంట్లో ధనం పెరగాలంటే దక్షిణ దిశలో పసుపు రంగులో ఉన్న బంతి పువ్వులను ఉంచాలి. ఇలా చేయడంతో ఆ ఇంట్లో డబ్బు ప్రవహిస్తుందట. మీరు తక్షణమే కోటీశ్వరులై పోవచ్చు.
ఉత్తర దిశలో..
ఇంటికి ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని ఉంచడం కారణంగా.. సంపద పెరుగుతుందట. కుబేర విగ్రహం సాధ్యం కాని పక్షంలో కనీసం కుబేర చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చట.
తూర్పు దిశలో..
ఇంటికి తూర్పు దిశలో ఒక చిన్న క్రిస్టల్ చేపను ఉంచాలట. మీరు వెండి చేపను కూడా ఉంచుకోవచ్చట. ఇది మరింత శుభప్రదంగా ఉంటుంది. ఇది ఇంటికి సంపదను తెస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
పశ్చిమ దిశలో..
ఇంటి పశ్చిమ భాగాన్ని హనుమంతుడి నివాసంగా భావిస్తారు. హనుమంతుడికి చెందిన చిన్న గదను ఈ దిశలో ఉంచాలి. ఇది ఇంట్లోని అన్ని కష్టాలను దూరం చేస్తుంది. హనుమంతుడి ఆశీస్సులను కూడా తెస్తుంది అని వాస్తు పండితులు పేర్కొంటున్నారు.