Vastu Tips | ఉప్పుతో ఆటలా..? ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి మరి..!
Vastu Tips | హిందూ సంస్కృతి( Hindu Culture )లో ఉప్పు( Salt )కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉప్పును కేవలం రుచి కోసం వినియోగిస్తారనుకుంటే పొరపాటే. ఈ ఉప్పు జీవితంలో సమతుల్యతను కాపాడడంతో పాటు ఆర్థిక కష్టాలను( Financial Problems ) తరిమేస్తుందని వాస్తు, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉప్పు సానుకూలత, సమతుల్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుందని సూచిస్తున్నారు.
Vastu Tips | ఉప్పు( Salt ) లేని ఇల్లు ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రతి వంటకంలో ఉప్పును వినియోగిస్తాం. ఆ ఉప్పు సరిపడ లేకపోతే ఏ వంటకం కూడా రుచిగా ఉండదు. ఆ మాదిరిగానే ఈ ఉప్పు జీవితంలో కూడా సమతులత్యను కాపాడుతుంది. ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూల శక్తిని పెంపొందించడానికి ఉప్పు ఉపయోగపడుతుందని వాస్తు, జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఉప్పు విషయంలో పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో, జీవితంలో సమతుల్యత ఏర్పడాలంటే.. ఉప్పును సరైన పాత్రల్లో నిల్వ చేయాలి. అంతేకాదు వంటగదిలో కూడా ఆ ఉప్పు పాత్రను సరైన దిశలో ఉంచాలి. అప్పుడే జీవితంలో సమతుల్యత ఏర్పడి ఆర్థిక కష్టాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.
జ్యోతిషశాస్త్రంలో ఉప్పు చంద్రుడు, శనితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. సరిగ్గా నిల్వ చేస్తే అది ఇంట్లో శుభ శక్తి స్థిరమైన ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఉప్పును ఎల్లప్పుడూ గాజు, సిరామిక్ పాత్రల్లో నిల్వ చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఆనందం , శ్రేయస్సు వస్తుందట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. అయితే ఇనుము లేదా అల్యూమినియం పాత్రలలో ఉప్పును నిల్వ చేయడం వల్ల దురదృష్టకరమైన ప్రభావం ఉంటుంది. ఇది ఉద్రిక్తత, సంఘర్షణ , ఆర్థిక నష్టానికి దారితీస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
వంటగదిలో ఉప్పు నిల్వ చేసే దిశ కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అని పండితులు పేర్కొంటున్నారు. ఆగ్నేయ దిశలో (అగ్ని కోణం) నిల్వ చేయడం శుభప్రదమని నిపుణులు అంటున్నారు. ఈ ప్రదేశంలో ఉప్పు ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక కష్టాలు కూడా మాయమవుతాయని పండితులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram