Karthika Masam | అప్పుల బాధలు తీర్చే ‘కందుల’ దీపం..! కార్తీక మాసంలో వెలిగించండి ఇలా..!!
Karthika Masam | అప్పు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ.. మనలో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు( Debts ) చేస్తుంటారు. ఆ అప్పులను తొలగించుకునేందుకు కార్తీక మాసం( Karthika Masam )లో కందుల దీపం( Kandula Deepam ) వెలిగిస్తే సరిపోతుందట.
Karthika Masam | జీవితంలో అప్పు( Debt ) లేకుండా బతకాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు. కానీ అది సాధ్యపడదు. ఏదో ఒక సందర్భంలో అప్పు చేయక తప్పదు. అలా అప్పులు( Debts ) మోపెడు అయి కూర్చుంటాయి. మరి ఈ అప్పులతో బాధపడేవారు వాటి నుంచి ఉపశమనం పొందాలనే అనేక పూజలు( Puja ) చేస్తుంటారు. అయినా కూడా అప్పులు తీరవు. కానీ కార్తీక మాసం( Karthika Masam )లో కందుల దీపం( Kandula Deepam ) వెలిగిస్తే అప్పులు తీరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసం.. దీపారాధనకు విశిష్టమైనది. ఈ మాసంలో కందుల దీపం వెలిగించడం వల్ల ధనం చేతికి అంది అప్పులు తీరిపోతాయట. ఈ కందుల దీపాన్ని కార్తీక మాసంలో అన్ని మంగళవారాలు లేదా ఏదైనా ఒక మంగళవారం వెలిగిస్తే.. సుబ్రహ్మణ్య స్వామి( Subramanya Swamy ) అనుగ్రహంతో రుణబాధలు తీరిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మరి కందుల దీపం ఎలా వెలిగించాలి..?
కందుల దీపం వెలిగించాలనుకున్న రోజు.. తెల్లవారుజామునే మేల్కొనాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తదనంతరం పూజగదిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి( Subramanya Swamy ) చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ ఫొటో ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో షట్కోణం ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద వెండి లేదా రాగి లేదా ఇత్తడి పళ్లెం ఉంచాలి. ఆ పళ్లెంకి ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం పీట మీద ఉంచిన పళ్లెంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు లేదా మసూర్ పప్పు ఉంచాలి. కేజీ వీలుకాకపోతే ఓ గుప్పెడు ఎర్ర కందిపప్పును ఉంచొచ్చు.
ఏ నూనెతో దీపం వెలిగిస్తే మంచిది..?
ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలు తీసుకుని వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి.. ఆ పప్పు మీద ఓ మట్టి ప్రమిదను ఉంచి దాని మీద మరో మట్టి ప్రమిదను ఉంచాలి. ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత తొమ్మిది ఎర్ర వత్తులు తీసుకుని వాటన్నింటినీ ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెలో ఉంచి దక్షిణం వైపు ఉండేలా దీపం వెలిగించాలి. ఎర్ర వత్తులు అందుబాటులో లేకపోతే మామూలు వత్తులకు కుంకుమ రాసి తొమ్మిది వత్తులను ఒకటిగా చేసుకోవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత మట్టి ప్రమిదలను తీసి ఆ కందులను నీటిలో నానబెట్టాలి. అవి నానిన తర్వాత అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. లేకుంటే ఆ కందులను ఎవరికైనా దానంగా కూడా ఇచ్చుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram