Chipuru | చీపురే క‌దా అని చీప్‌గా చూడొద్దు..! ఆ రెండు రోజుల్లో కొంటే అశుభ‌మ‌ట‌..!!

Chipuru |హిందూ సంప్ర‌దాయంలో చీపురుకు చాలా ప్రాధాన్య‌త ఉంది. చీపురు( Chipuru )లో ల‌క్ష్మీదేవి( Lakshmi devi ) నివ‌సిస్తుంద‌ని న‌మ్ముతారు. కాబ‌ట్టి చీపురు విష‌యంలో ప్ర‌తి మ‌హిళ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది.

Chipuru | చీపురే క‌దా అని చీప్‌గా చూడొద్దు..! ఆ రెండు రోజుల్లో కొంటే అశుభ‌మ‌ట‌..!!

Chipuru | చీపురు( Chipuru ) ప్ర‌తి ఇంట్లో క‌నిపించే వ‌స్తువు. ఎందుకంటే ఇంటిని( House ), వాకిలిని శుభ్రం చేసేందుకు ఉప‌యోగించే వ‌స్తువు కాబ‌ట్టి. అయితే చీపురే క‌దా..? అని చీప్‌గా చూడొద్దు. ఎందుకంటే ఆ చీపురులో ల‌క్ష్మీదేవి( Lakshmi Devi ) నివ‌సిస్తుంద‌ని ఆధ్యాత్మికంగా మ‌హిళ‌లు న‌మ్ముతారు. కాబ‌ట్టి చీపురు విష‌యంలో వాస్తు నియ‌మాలు( Vastu Tips ) త‌ప్ప‌క పాటించాలి. మ‌నం ఇంట్లో ఏ దిశ‌లో చీపురు పెట్టుకోవాలి అనే విష‌యం నుంచి ఎప్పుడు కొంటే శుభ‌ప్ర‌దం.. ఏ రోజుల్లో కొంటే అశుభ‌మో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

చీపురు విషయంలో పాటించే వాస్తు నియమాలు ఇంటి వాతావరణాన్ని ఆనందం, శాంతి , శ్రేయస్సుతో నింపడానికి సహాయపడతాయి. చీపురును సరైన చోట పెట్టకపోయినా.. సరైన రోజున కొనుగోలు చేయకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట.

చీపురును త‌ల‌క్రిందులుగా పెట్టొచ్చా..?

చాలా మంది మ‌హిళ‌లు ఇల్లును శుభ్రం చేసిన త‌ర్వాత చీపురును ఎక్క‌డ అంటే అక్క‌డ ప‌డేస్తుంటారు. అది ఏ మాత్రం మంచిది కాద‌ని వాస్తు పండితులు హెచ్చ‌రిస్తున్నారు. కొంత‌మంది మ‌హిళ‌లు చీపురును త‌ల‌క్రిందులుగా పెడుతుంటారు. దీని వ‌ల్ల ల‌క్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంద‌ట‌. కాబ‌ట్టి చీపురును ఎల్ల‌ప్పుడూ నేల మీద ప‌డుకోబెట్ట‌డం మంచిద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఏయే రోజుల్లో చీపురును కొన‌కూడ‌దు..!

పాడైన చీపురుతో ఇల్లును శుభ్రం చేయ‌లేం. కాబ‌ట్టి కొత్త చీపురును కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తుంటాం. అయితే కొత్త చీపురు కొనాల‌నుకున్న‌ప్పుడు కూడా త‌ప్ప‌కుండా వాస్తు నియామాలు పాటించాల‌ట‌. సోమ‌, శ‌నివారాల్లో అస‌లు చీపురు కొన‌కూడ‌ద‌ట‌. సోమ‌వారం చీపురు కొన‌డాన్ని అశుభంగా ప‌రిగ‌ణిస్తార‌ట‌. శనివారం శనీశ్వ‌రుడి రోజు కనుక శనివారం కూడా చీపురు కొనకూడద‌ట‌. ఈ రోజున చీపురు కొనడం లేదా పారవేయడం వల్ల శని దోషం కలుగుతుందని నమ్ముతారు. అంతే కాదు శుక్లపక్షంలో చీపురు కొనడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మ‌రి చీపురు ఏ రోజు కొంటే శుభ‌ప్ర‌దం..!

గురువారం రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదం. అది కూడా కృష్ణ పక్షంలోని గురవారం చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

డైనింగ్ రూమ్‌లో చీపురు ఉంచుతున్నారా..?

డైనింగ్ రూమ్‌లో చీపుర్లు ఉంచకూడదు. డైనింగ్ రూమ్‌లో చీపురు పెట్టుకోవడం వల్ల ఇంటికి పేదరికం వస్తుందట‌. ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.