Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారికి గురు బలం రెట్టింపు.. ఇల్లు కొనడం ఖాయం..!
Zodiac Signs | ప్రతి ఒక్కరికి సొంతింటి( House ) కల ఉంటుంది. కానీ కొందరికి నెరవేరుతుంది. ఇంకొందరికి నెరవేరదు. అయితే ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి సొంతింటి కల నెరవేరే అవకాశం వచ్చింది. గురు( Jupiter ) బలం రెట్టింపు కారణంగా ఈ నాలుగు రాశుల వారు తప్పకుండా ఇల్లును కొంటారట.

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం( Jupiter ) ఒకటి. ఈ గురు గ్రహం ఓ వ్యక్తి యొక్క జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే గురువు శుభస్థానంలో ఉంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇల్లు( House ) కొనేవారికి, స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి తప్పకుండా గురు ఉండాలని పండితులు చెబుతారు. అప్పుడే ఏదైనా కొనుగోలు చేసే శక్తిసామర్థ్యాలు లభిస్తాయని అంటున్నారు. ఇల్లు, స్థిరాస్తులు కొనుగోలు చేయడమే కాదు.. జీవితంలో శ్రేయస్సు, ఆనందం, శాంతిని కూడా పెంపొందిస్తాయట. అయితే గురు సంచారంతో నాలుగు రాశుల వారికి గురు బలం రెట్టింపు కానున్నదంట. దీంతో ఇల్లు కొనేందుకు ఈ నాలుగు రాశుల వారికి బలం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ నాలుగు రాశులేంటో తెలుసుకుందాం..
తులా రాశి( Libra )
ఇల్లు నిర్మించుకోవాలి.. కొనాలకునే తులా రాశి వారి కల త్వరలోనే నెరవేరబోతుంది. ఎందుకంటే గురు బలం ఈ రాశివారికి మెండుగా ఉందట. దీంతో వారు ఇప్పుడు ఏ పని చేసినా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుందని, స్థిరాస్తి కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదని చెబుతున్నారు పండితులు.
ధనస్సు రాశి( Sagittarius )
ఈ రాశి వారికి కూడా గురు గ్రహం సంచారంతో అష్టైశ్వర్యాలు సిద్ధించనున్నాయని పండితులు చెబుతున్నారు. మంచి కంపెనీలో ఉద్యోగం సాధించడమే కాకుండా.. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉందట. ఇల్లు కొనాలనే కల కూడా నెరవేరుతుందట. మొత్తానికి సంతోషంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి( Gemini )
ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా గురు గ్రహం అనుగ్రహంతో విజయవంతంగా పూర్తి చేస్తారట. వ్యాపారం ప్రారంభించేందుకు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఇది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయట. మరి ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుతారని పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా ఎలాంటి సమస్యలు లేవని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.
కర్కాటక రాశి( Cancer )
ఈ రాశి వారికి గురు బలం వలన ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.