Heritage Foods fine| హెరిటేజ్ కు షాక్..నాణ్యత లోపాలపై లక్ష ఫైన్!

హెరిటేజ్ ఉత్పత్తులలో నాణ్యత లోపాల అంశాలపై ఆ సంస్థకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథార్టీ ఆఫ్ ఇండియా(FSSAI) రూ. లక్ష రూపాయల జరిమానా విధించింది. పెరుగులో కనీస పాలకొవ్వు లేదని తేల్చిన అధికారులు, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ కింద ఈ పెనాల్టీ వేశారు.

Heritage Foods fine| హెరిటేజ్ కు షాక్..నాణ్యత లోపాలపై లక్ష ఫైన్!

అమరావతి : హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ సంస్ధకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథార్టీ ఆఫ్ ఇండియా(FSSAI) షాక్ ఇచ్చింది.  హెరిటేజ్ ఉత్పత్తులలో నాణ్యత లోపాల అంశాలపై ఆ సంస్థకు FSSAI రూ. లక్ష రూపాయల జరిమానా విధించింది. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ హ‌ర్యానాలో  విక్రయిస్తున్న ‘టోటల్‌ కర్డ్‌’ పెరుగులో నాణ్యత లోపించిందంటూ.. సబ్‌-స్టాండర్డ్‌ ఉత్పత్తిగా నిర్ధారించింది. నిబంధనలు, ప్రమాణాలను పాటించకుండా నాణ్యత లేని పెరుగును విక్రయిస్తున్నందుకు హెరిటేజ్‌కు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్లుగా పేర్కొంది.

పెరుగులో కనీస పాలకొవ్వు లేదని తేల్చిన అధికారులు, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ కింద ఈ పెనాల్టీ వేశారు. అయితే కోట్లాది మంది వినియోగదారులు ఉన్న హెరిటేజ్ సంస్థ ఉత్పత్తుల్లో నాణ్యత లోపాలను గుర్తించినప్పటికి..కేవలం లక్ష రూపాయల ఫైన్ మాత్రమే విధించడం చర్చనీయాంశమైంది. ఓ వైపు తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీ అంశాలపై ఏపీ రాజకీయాల్లో రచ్చ కొనసాగుతున్న సమయంలోనే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు నాణ్యత లోపానికి సంబంధించి ఫైన్ విధించిన అంశం వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది.