Kalvakuntla Kavitha | ఏప్రిల్ 25 శ‌క్తివంత‌మైన‌దే.. కానీ క‌విత‌కు కొంత స‌వాలే..!

Kalvakuntla Kavitha | తెలంగాణ గ‌డ్డ మీద మ‌రికాసేప‌ట్లో మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. ఏప్రిల్ 25న ఉద‌యం 10 గంట‌ల‌కు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు.

  • By: raj |    devotional |    Published on : Apr 25, 2026 6:00 AM IST
Kalvakuntla Kavitha | ఏప్రిల్ 25 శ‌క్తివంత‌మైన‌దే.. కానీ క‌విత‌కు కొంత స‌వాలే..!

Kalvakuntla Kavitha | తెలంగాణ గ‌డ్డ మీద మ‌రికాసేప‌ట్లో మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. ఏప్రిల్ 25న ఉద‌యం 10 గంట‌ల‌కు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మేడ్చ‌ల్ జిల్లాలోని మునీరాబాద్ గ్రామ ప‌రిధిలోని అద్వ‌య క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా పార్టీ జెండాను ఆవిష్క‌రించి, పార్టీ పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. అస‌లు ఏప్రిల్ 25వ తేదీనే త‌న రాజ‌కీయ పార్టీ ప్ర‌స్థానానికి క‌విత ఎంచుకున్నారో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఏప్రిల్ 25కు ఎందుకంత ప్ర‌త్యేక‌త‌..?

ముందుగా ఏప్రిల్ 25 తిథి, వారం, నక్షత్ర వివరాలు చూద్దాం ( పంచాంగం ప్రకారం)

ఏప్రిల్ 25 శనివారం, వైశాఖమాసం

నక్షత్రం – ఆశ్లేష రాత్రి 11 గంటల 29 వరకూ.. అంటే రోజంతా ఆశ్లేష నక్షత్రమే
తిథి – నవమి శనివారం రాత్రి 10 గంటల 1 నిముషం నుంచి మొదలు

అమృత ఘడియలు – రాత్రి 9 గంటల 56 నిముషాల నుంచి 11 గంటల 28 వరకు
వర్జ్యం – మధ్యాహ్నం 12 గంటల 43 నుంచి 2 గంటల 15 వరకు
దుర్ముహూర్తం – సూర్యోదయం ఉదయం 7 గంటల 22 వరకు

సీతాదేవీ జ‌న్మించిన రోజు కూడా..

ఏప్రిల్ 25 శనివారం వైశాఖ శుక్ల నవమి.. సీతానవమి ( సీతాదేవి జన్మించిన రోజు)
మాతృశక్తి, ధర్మం, పాతివ్రత్యం, సమాజ సేవకు సంకేతం
సీతానవమి రోజు కొత్త కార్యక్రమాలు, సంస్థలు లేదా జనసేవా ఉద్యమాలు ప్రారంభించేందుకు ఆధ్యాత్మికంగా మంచి శక్తి ఉంటుంది.

కానీ కొంత స‌వాలే..!

ఏప్రిల్ 25న ఆశ్లేష నక్షత్రం..ఇది సర్ప నక్షత్రం – శక్తివంతమైనదే కానీ కొంత సవాలు ఉంటుంది. శ‌నివారం దీర్ఘకాలిక ఫలితాలు పొందుతారు కానీ కష్టపడాల్సి ఉంటుంది, ఫలితం కాస్త ఆలస్యం అవుతుంది.

బ‌ల‌ప‌ర‌చ‌నున్న ఆధ్యాత్మిక శ‌క్తి..!

క‌విత జ‌న్మతేదీ 1978 మార్చి 13. ఆమె జ‌న్మించిన రోజు పంచాంగం ప్ర‌కారం భ‌ర‌ణి న‌క్ష‌త్రం. దీని ప్ర‌స్తుతం ఏలినాటి ద‌శ న‌డుస్తోంది. ఈ శ‌ని దాదాపు ఐదున్న‌రేండ్లు ఉండే అవ‌కాశం ఉంది. అయితే రెండున్న‌రేండ్ల త‌ర్వాత శ‌ని ప్ర‌భావం కాస్త త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పండితులు చెబుతున్నారు. క‌విత జాతకంలో శని యోగకారకుడు అయితే ఈ సమయంలో ఆమె దూకుడుకు సాటెవ్వరూ ఉండర‌ని పేర్కొంటున్నారు. సాధారణ రాజకీయ పార్టీగా కాకుండా జన ఉద్యమంగా మారితే ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితం ఉంటుంది.

అయితే 2026 ఏప్రిల్ 25న శ‌ని, రాహు ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంది. గండయోగం+ ఆశ్లేష నక్షత్రం.. ఆమె జాతకంలో కొన్ని గ్రహస్థితులతో కలిపి చూస్తే ప్రారంభంలో సవాళ్లు, వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుంది. అయితే సీతానవమి రోజు పార్టీ ఆవిర్భవిస్తున్నందున ఆధ్యాత్మిక శక్తి ఆమెను బలపరుస్తుంది. ఫలితం ఆలస్యం అవుతుందేమో కానీ..దీర్ఘకాలిక ఫలితం పొందే అవకాశాలున్నాయి. యువత, స్త్రీల నుంచి భారీగా మద్దతు లభించే అవకాశం ఎక్కువ. ఆధ్యాత్మికంగా ఇది ధర్మయుద్ధంలా మారొచ్చు.