కాశీ విశ్వనాధుని బంగారు శిఖరంపై తెల్ల గుడ్లగూబ..వైరల్ !
కాశీ విశ్వనాథ ఆలయ బంగారు శిఖరంపై అరుదైన తెల్ల గుడ్లగూబ దర్శనం.. హిందూ సంప్రదాయంలో శుభసూచకంగా భావించి వైరల్ అయింది.

విధాత : ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం కాశీ విశ్వనాథుని ఆలయం బంగారు శిఖరంపై అరుదైన తెల్ల గుడ్లగూబ కనిపించడం వైరల్ గా మారింది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని..రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక తెల్ల గుడ్లగూబ ఆలయ బంగారు శిఖరంపై అందంగా కూర్చుంది. అయితే ఈ ఘటన శుభానికి చిహ్నంగా భావిస్తున్నారు. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ సీఈవో విశ్వ భూషణ్ కూడా స్వామివారి ఆలయ శిఖరంపై తెల్ల గుడ్లుగూబ కూర్చోవడం “భారతదేశానికి చాలా శుభవార్త” అని అని పేర్కొన్నారు.
“హిందూ పురాణాలు, వేద జ్యోతిషశాస్త్రంలో తెల్ల గుడ్లగూబను చాలా పవిత్రమైనదిగా శుభసూచకంగా పరిగణిస్తారు. దీనిని సంపద , శ్రేయస్సు అధిదేవత అయిన లక్ష్మీ దేవి వాహనంగా పరిగణిస్తారు. ఎవరికైనా రాత్రి సమయంలో తెల్ల గుడ్లగూబ కనిపిస్తే అది శుభసూచకం అని నమ్మకం. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని.. సానుకూల ఆధ్యాత్మిక పరివర్తన, దైవిక రక్షణ, మార్గదర్శకత్వాన్ని సూచిస్తుందని.. అంతేకాదు ఆర్ధికంగా లాభాలు అందుకోనున్న సంకేతమని భావిస్తారు.
ఇవి కూడా చదవండి…
Delhi CM Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జడ్ కేటగిరి సెక్యూరిటీ!
Bomb Threat : మందుపాతర పేలుస్తాం..పావురంతో హెచ్చరిక !