Bomb Threat : మందుపాతర పేలుస్తాం..పావురంతో హెచ్చరిక !

భారత్-పాక్‌ సరిహద్దు వద్ద పావురం కలకలం. దాని కాలుకి ‘జమ్మూ ఐఈడీ బ్లాస్ట్’ బెదిరింపు సందేశం అధికారులు అప్రమత్తం, భద్రత కట్టుదిట్టం.

Bomb Threat : మందుపాతర పేలుస్తాం..పావురంతో హెచ్చరిక !

Bomb Threat | న్యూఢిల్లీ : భారత్‌- పాక్‌ సరిహద్దు సమీపంలో ఓ పావురం కలకలం రేపింది. మందుపాతరను పేల్చేస్తామంటూ దాని కాలుకి బెదిరింపు సందేశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్‌ఎస్‌ పురాలోని ఖాట్మారియన్‌ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం అధికారులు ఓ పావురాన్ని పట్టుకున్నారు.

దాని కాలుకి ఉర్దూ, ఆంగ్లంలో కట్టి ఉన్న సందేశంలో కశ్మీర్‌ మాది.. సమయం వచ్చింది.. అది వస్తుంది’ అని ఉర్దూలో, ‘జమ్మూస్టేషన్‌ ఐఈడీ బ్లాస్ట్‌’ అని ఆంగ్లంలో రాసి ఉంది. వెంటనే జమ్మూ రైల్వేస్టేషన్‌ సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ పావురం ఇక్కడికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.