Ugadi Rasi Phalau 2025 | ఉగాది త‌ర్వాత తులా రాశి వారికి.. శని, రాహు, కేతు గ్రహాల వ‌ల్ల లాభం..!

Ugadi Rasi Phalau 2025 | తులా రాశి( Libra ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు పొందుతారు.

Ugadi Rasi Phalau 2025 | ఉగాది త‌ర్వాత తులా రాశి వారికి.. శని, రాహు, కేతు గ్రహాల వ‌ల్ల లాభం..!

Ugadi Rasi Phalau 2025 | తులా రాశి( Libra ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు పొందుతారు.

15 మే 2025 వరకు అధికమగు కుటుంబ పరమైన ఖర్చుల వలన సమస్యలు ఎదుర్కొందురు. మాత్రు వర్గమునకు అవసరమగు ధనం సర్దుబాటు చేయుట కష్టం అవుతుంది. నూతన శత్రుత్వాలు బాదిస్తాయి.

16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకూ కొద్దిపాటి అనుకూల ఫలితాలు పొందుతారు. వారసత్వ సంబంధ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్థి కి సంబందించిన లాభములను పొందుతారు. భాత్రు వర్గంతో సఖ్యత ఏర్పడుతుంది.

20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు మంచి అనుకూల ఫలితాలు పొందుటకు సూచనలు ఉన్నవి. దూర దేశ నివాస లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఈ కాలం చక్కటి అనుకూల కాలం. విహార యాత్రలు చేయాలనే ఆలోచన కార్యరూపము దాల్చును. ఈ కాలం లో చేయు ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి. ఆచార సాంప్రదాయాల పట్ల ఆశక్తి ప్రదర్శిస్తారు.

6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు ప్రతికూల ఫలితాలు పొందుతారు. చిన్న విషయాలకు కూడా తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. ఈ కాలంలో స్థిరాస్థి సంబంధ క్రయ విక్రయాలు మాత్రం లాభాలను కలుగచేస్తాయి.

తులా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విదేశీ సంబంధ వ్యవహారాలలో చక్కటి అనుకూలత పొందుతారు. కుటుంబములోని పెద్ద వయస్సు వారి తీర్ధయాత్రల కోరిక నేరవేర్చగలరు. వ్యక్తిగత జాతకంలో శని స్వక్షేత్రంలో ఉన్న వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్ధికంగా మిక్కిలి లాభకరంగా ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

తులా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన ఒక్క సంతాన సంబంధ విషయాలలో మినహా మిగిలిన అన్ని విషయాలలో చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. 18 మే 2025 వరకు ఆర్ధికంగా బాగా కలసి వస్తుంది. వ్యాపార వర్గము వారికి అధికంగా అనుకూలత ఉంటుంది. 19 మే 2025 నుండి సంతాన సంబంధ సమస్యలు బాధిస్తాయి.

తులా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. పారమార్ధిక చింతన అధికం అవుతుంది. ధ్యాన మార్గంలో ఉన్నవారికి ఉచ్చ యోగం లభిస్తుంది. ఆర్ధికంగా చక్కటి అనుకూల కాలం. 19 మే 2025 నుండి సదా సద్వయం చేయుదురు. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఒక్క గురు గ్రహం వలన మాత్రమే ప్రతికూల ఫలితాలు ఏర్పడును. శని, రాహు మరియు కేతు గ్రహముల వలన లాభకరంగా ఉంటుంది.