ఆ ఒక్క పువ్వుతో శివుడిని పూజిస్తే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

శివుడికి ఈ పువ్వు అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఈ పువ్వుతో శివ‌య్య‌ను పూజిస్తే కోరిన కోరిక‌లు త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. శివ‌య్య అనుగ్ర‌హం క‌చ్చితంగా ల‌భిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ పువ్వు ఏంటో తెలుసుకుందాం..

ఆ ఒక్క పువ్వుతో శివుడిని పూజిస్తే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

సోమ‌వారం శివుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన రోజు. ఈ రోజున భ‌క్తులు శివ‌య్య‌ను ఎంతో భ‌క్తితో పూజిస్తారు. ఆల‌యాల‌కు వెళ్లి అభిషేకాలు నిర్వ‌హిస్తారు. ఇంట్లో కూడా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, శివుడికి ఇష్ట‌మైన పూల‌ను, నైవేద్యాల‌ను స‌మ‌ర్పిస్తుంటారు. అయితే శివుడికి ఈ పువ్వు అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఈ పువ్వుతో శివ‌య్య‌ను పూజిస్తే కోరిన కోరిక‌లు త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. శివ‌య్య అనుగ్ర‌హం క‌చ్చితంగా ల‌భిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ పువ్వు ఏంటో తెలుసుకుందాం..

ఏడు జ‌న్మ‌ల పాపం తొల‌గిపోవాలంటే ఆ ఒక్క పువ్వు చాలు. శివుడికి ఎంతో ఇష్ట‌మైన ఆ పుష్ప రాజం చాలా బాగుంటుంది. ఒకే ఒక పువ్వును ఆయ‌న ముందు ఉంచితే స‌మ‌స్త దోషాల‌న్నీ హ‌రిస్తాడ‌ట‌. కైలాస‌వాసుడికి ఎంతో ఇష్ట‌మైన పువ్వుగా ఇది చెబుతారు. ఆ పువ్వే ఉమ్మెత్త పువ్వు.

కేర‌ళలో శివుడిని ఉమ్మెత్త పువ్వుతో పూజించ‌డం అన‌వాయితీగా వ‌స్తోంద‌ట‌. ఈ పువ్వును శివుని ద‌గ్గ‌ర ఉంచి వేడుకుంటే భ‌క్తుల‌కు మోక్షం సిద్ధిస్తుంద‌ట‌. శివాలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి అని అక్కడ బాగా నమ్ముతారు. ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

ఆ పూలతో శివయ్యను పూజించడం వల్ల దరిద్రం పోవడం మాత్రమే కాదు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగి పోతాయి..అమావాస్యకు, పౌర్ణమికి ఒక్క రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని విశ్వాసం. ఆ సమయంలో శివునిని దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుడిని పూజించాలి. అప్పుడే దోషాలు తొలగిపోతాయి.. సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అందుకే ఉమ్మేత్త పూలతో ఒకసారి శివయ్యను పూజించి ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి..