Marriage dates in May month | మే నెలలో పెళ్లిళ్లే పెళ్లిళ్లు..! శుభ ముహూర్తాలు ఇవే..!!
Marriage dates in May month | హిందు సంప్రదాయం( Hindu Custom )లో పెళ్లిళ్లు( Marriages ) చేయాలంటే అమ్మాయి, అబ్బాయి జాతక ఫలాలు చూసిన తర్వాత.. వివాహాలకు ముహూర్తం( Marriage Dates ) ఖరారు చేస్తారు. మరి మే నెలలో పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. శుభ ముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి. మీరు కూడా ఈ నెలలో వివాహం( Marriage ) చేసుకోవాలని ఆలోచిస్తుంటే, 2025 మే నెల( May Month )లో శుభప్రదమైన వివాహ ముహూర్తాలు ఎప్పుడున్నయో తెలుసుకుందాం..

Marriage dates in May month | చైత్రమాసం తర్వాత వచ్చే మాసమే వైశాఖ మాసం తెలుగు సంవత్సరం( Telugu Calendar )లో రెండవ నెల. చంద్రుడు ఈ మాసంలో విశాఖ నక్షత్రంతో ఉంటాడు కనుక ఈ నెలకు వైశాఖ మాసం అని పేరు. ఈ వైశాఖంను మాధవ మాసం అని కూడా అంటారు, లక్ష్మీ నారాయణులకు చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వివాహాలు( Marriages ), గృహాప్రవేశాలు, శంఖుస్థాపనాలు, ఉపనాయనాలు, సీమంతం వంటి శుభకార్యాలు చేయడం శుభప్రదం.
ఇప్పటికే చాలా మందివి నిశ్చితార్థాలు( Engagements ) జరిగిపోయి ఉంటాయి. ఇక మిగిలింది పెళ్లి( Marriage ) తంతే అయి ఉండొచ్చు. కాబట్టి పెళ్లి ముహూర్తాల కోసం ఎదురుచూసే వారు చాలా మందే ఉంటారు. మరి 2025 మే నెలలో వివాహానికి , శుభకార్యాలకు శుభ సమయాలు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం..
మే 2025 లో శుభ వివాహ ముహూర్తాలు ఇలా..
మే 1, గురువారం : ఉదయం 11:23 నుండి మధ్యాహ్నం 02:21 వరకు.
మే 5, సోమవారం : రాత్రి 8:28 నుండి మరుసటి రోజు ఉదయం 5:54 వరకు.
మే 6, మంగళవారం : ఉదయం 5:54 నుండి మధ్యాహ్నం 3:51 వరకు.
మే 8, గురువారం : మధ్యాహ్నం 12:28 నుండి ఉదయం 5:52 వరకు.
మే 9, శుక్రవారం : ఉదయం 5:52 నుండి మధ్యాహ్నం 12:08 వరకు.
మే 10, శనివారం : ఉదయం 3:15 నుండి మరుసటి రోజు ఉదయం 4:01 వరకు.
మే 14, బుధవారం : ఉదయం 6:34 నుండి 11:46 వరకు.
మే 15, గురువారం : ఉదయం 4:02 నుండి మరుసటి రోజు ఉదయం 5:26 వరకు.
మే 16, శుక్రవారం : ఉదయం 5:49 నుండి సాయంత్రం 4:07 వరకు.
మే 17, శనివారం : సాయంత్రం 5:43 నుండి మరుసటి రోజు ఉదయం 5:48 వరకు.
మే 18, ఆదివారం : సాయంత్రం 5:48 నుండి 6:52 వరకు.
మే 22, గురువారం : మధ్యాహ్నం 1:11 నుండి ఉదయం 5:46 వరకు.
మే 23, శుక్రవారం : ఉదయం 5:46 నుండి మరుసటి రోజు ఉదయం 5:46 వరకు.
మే 24, శనివారం : ఉదయం 5:22 నుండి ఉదయం 8:22 వరకు.
మే 27, మంగళవారం : సాయంత్రం 6:44 నుండి మరుసటి రోజు ఉదయం 5:45 వరకు.
మే 28, బుధవారం : ఉదయం 5:45 నుండి సాయంత్రం 7:08 వరకు.