చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు.. మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్‌లకు ఆహ్వానం
విధాత: శనివారం నుండి ప్రారంభం కానున్న చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు జిల్లా మంత్రి జి .జగదీశ్ రెడ్డిని, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను ఆహ్వానిస్తూ శుక్రవారం ఆలయ అధికారులు, అర్చక బృందం ఆహ్వాన పత్రికను అందజేశారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వారిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చక బృందం మంత్రికి ఆశీర్వచనాలు పలికారు. బ్రహ్మోత్సవాలకు సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా ఉండటంతో మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే […]

విధాత: శనివారం నుండి ప్రారంభం కానున్న చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు జిల్లా మంత్రి జి .జగదీశ్ రెడ్డిని, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను ఆహ్వానిస్తూ శుక్రవారం ఆలయ అధికారులు, అర్చక బృందం ఆహ్వాన పత్రికను అందజేశారు.
సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వారిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చక బృందం మంత్రికి ఆశీర్వచనాలు పలికారు. బ్రహ్మోత్సవాలకు సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా ఉండటంతో మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు.
ప్రభుత్వం తరపున ఈ నెల 29 వ తేదీన స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేస్తారు. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల జాతరలో భాగంగా ఈ నెల 28న ఉదయం 10 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
29 వ తేదీ తెల్లవారు జామున 4గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 30న అగ్నిగుండాలు, 31న దోపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. ఫిబ్రవరి1 రాత్రి పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు గజవాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం బ్రహోత్సవాలు పరిపూర్ణం అవుతాయి.