Raksha Bandhan 2025 | ఎల్లుండే రక్షా బంధన్.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా..?
Raksha Bandhan 2025 | సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగ( Raksha Bandhan 2025 )జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ( Rakhi ) కట్టి.. ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటామని అన్నాదమ్ముళ్లు వాగ్దానం చేస్తారు.
Raksha Bandhan 2025 | సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగ( Raksha Bandhan 2025 )జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ( Rakhi ) కట్టి.. ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటామని అన్నాదమ్ముళ్లు వాగ్దానం చేస్తారు. మరి ఈ ఏడాది రాఖీ పండుగ( Rakhi Festival ) ఎప్పుడు వచ్చింది.? ఏ సమయంలో రాఖీ కట్టాలి..? ఏ సమయంలో కట్టకూడదు..? వంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రాఖీ పండుగ ఎప్పుడంటే..?
ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చింది. అంటే శ్రావణ శుక్రవారం మరుసటి రోజు శనివారం నాడు రాఖీ పండుగ నిర్వహించుకోనున్నారు.
ఏ సమయంలో రాఖీ కట్టాలి..?
సోదరులకు రాఖీ కట్టేందుకు ఆగస్టు 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శుభ సమయం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇలా శుభ ముహూర్తంలో కడితే సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభించి, సోదర సోదరీమణులు సుఖసంతోషాలతో విరాజిల్లుతారని పండితులు పేర్కొంటున్నారు.
భద్రకాలంలో రాఖీ కట్టొచ్చా..?
పంచాంగం ప్రకారం భద్ర అనేది ఒక తిథిలోని సగభాగం. ఇది ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథిలలో ఉంటుంది. చంద్రుడు కర్కాటకం, సింహం, కుంభం, లేదా మీన రాశులలో ఉన్నప్పుడు భద్ర కాలం ప్రారంభమవుతుంది. ఈ రాశులలో చంద్రుడు ఉన్నంత సేపు భద్ర కాలం ఉంటుంది. ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేసినా ఆటంకాలు ఎదురవుతాయని, అశుభం కలుగుతుందని నమ్ముతారు. అందుకే భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టాలని చెబుతున్నారు. సోదరుల మేలు కోరే పండగ రాఖీ కాబట్టి, ఈ పర్వదినం రోజున భద్రకాలం ముగిసిన తర్వాత భద్రకాలంలో కాకుండా అపరాహ్న కాలంలో కట్టాలని సూచిస్తున్నారు.
రాఖీ కట్టే వేళ ఏ దుస్తులు ధరించాలి..?
రాఖీ కట్టేటప్పుడు, కట్టించుకునేటప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని దీనివల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram