Temples | ఇండియాలో పురుషుల‌కు ప్ర‌వేశం లేని ఆరు ఆల‌యాలు ఇవే..! ఎందుకో తెలుసా..?

Temples | ఆల‌యం.. అంటేనే ఒక ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణానికి నిద‌ర్శ‌నం. ఆల‌యంలోకి అడుగుపెట్ట‌గానే మ‌న మ‌న‌సులో ఏదో తెలియ‌ని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాం. మన‌సంతా ప్ర‌శాంతంగా ఉంటుంది. లింగ బేధం లేకుండా అంద‌రూ పూజ‌లు చేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ ఈ ఆరు ఆల‌యాల్లో మాత్రం పురుషుల‌కు ప్ర‌వేశం లేదు. మ‌రి ఆ ఆల‌యాలు ఎక్క‌డో లేవు.. మ‌న ఇండియాలోనే ఉన్నాయి.

Temples | ఇండియాలో పురుషుల‌కు ప్ర‌వేశం లేని ఆరు ఆల‌యాలు ఇవే..! ఎందుకో తెలుసా..?

Temples | ఆల‌యం.. అంటేనే ఒక ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణానికి నిద‌ర్శ‌నం. ఆల‌యంలోకి అడుగుపెట్ట‌గానే మ‌న మ‌న‌సులో ఏదో తెలియ‌ని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాం. మన‌సంతా ప్ర‌శాంతంగా ఉంటుంది. మ‌రి అంత గొప్ప ఆల‌యాల్లోకి ఆడ‌, మ‌గ అనే బేధం లేకుండా అంద‌రూ ప్ర‌వేశిస్తుంటారు. కుటుంబ స‌భ్యులంతా క‌లిసి ఆల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేస్తుంటారు. లింగ బేధం లేకుండా అంద‌రూ పూజ‌లు చేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ ఈ ఆరు ఆల‌యాల్లో మాత్రం పురుషుల‌కు ప్ర‌వేశం లేదు. మ‌రి ఆ ఆల‌యాలు ఎక్క‌డో లేవు.. మ‌న ఇండియాలోనే ఉన్నాయి. పురుషుల‌కు ప్ర‌వేశం లేని ఆ ఆరు ఆల‌యాల గురించి తెలుసుకుందాం..

అట్టుకల్ భగవతి ఆలయం

అట్టుక‌ల్ భ‌గ‌వ‌తి ఆల‌యం కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఉంది. ఈ ఆల‌యం పొంగ‌ళ పండుగ‌కి ఎంతో ప్ర‌సిద్ధి. ఈ పండుగ స‌మ‌యంలో ఆల‌యానికి ల‌క్ష‌లాది మంది మ‌హిళా భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. అమ్మ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల సమృద్ధి, శ్రేయస్సు లాభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పండుగ సందర్భంగా ఆలయం ప్రాంగణంలోకి పురుషులని అనుమతించరు. ఈ పవిత్రమైన ఆచారంలో స్త్రీలు మాత్రమే పాల్గొంటారు.

చక్కులతుకవు దేవాలయం

చక్కులతుకవు ఆలయం కూడా కేరళలోనే ఉంది. ఈ ఆల‌యంలో దుర్గాదేవి కొలువై ఉంది. ఇక్క‌డ‌ నారీ పూజ ప్రత్యేక కార్యక్రమం. అంటే స్త్రీలని పూజించడమని అర్థం. వార్షిక నారీ పూజ ఉత్సవం సంద‌ర్భంగా ఆల‌యంలోకి పురుషుల‌కు ప్ర‌వేశం ఉండ‌దు. భారత్ నలుమూలల నుంచి మహిళలు ఇక్కడికి వస్తారు. ఇక్కడ పూజ చేస్తే అదృష్టం, ఆరోగ్యం లాభిస్తాయని నమ్ముతారు.

కామాఖ్య ఆలయం

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి కామాఖ్య ఆలయం. శివుడు భార్య సతీదేవి శరీరాన్ని విష్ణు సుదర్శన్ చక్రంతో ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు. అసోంలోని గౌహతిలో నీలాచల్ కొండపై ఈ లయం ఉంది. రుతుక్రమంలో ఉన్న మహిళలు కూడా ఈ ఆలయానికి రావచ్చు. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసేసి ఉంచుతారు. ఆ సమయంలో పురుషులు ప్రవేశించడానికి అనుమతించరు.

కుమారి అమ్మన్ ఆలయం

కుమారి అమ్మ‌న్ ఆల‌యం త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో ఉంది. ఈ ఆల‌యం ప్ర‌త్యేక‌త ఏంటంటే.. పార్వ‌తీ దేవి అవ‌తార‌మైన క‌న్యాకుమారి దేవ‌త ఇక్క‌డ కొలువై ఉంది. ఈ ఆల‌య గ‌ర్భ గుడిలోకి పెళ్లైన పురుషుల‌ను అనుమ‌తించ‌రు. మ‌హిళ‌లు మాత్ర‌మే ఇక్క‌డ అమ్మ‌వారిని పూజిస్తారు. ఆలయ ద్వారం వరకు మాత్రం సన్యాసులు వచ్చి దర్శించుకోవచ్చు. వివాహిత పురుషులు ఆలయం సాంప్రదాయాలు పాటిస్తూ దూరంగా ఉండి పూజ చేసుకోవచ్చు.

బ్రహ్మ దేవాలయం

బ్ర‌హ్మ దేవాల‌యం రాజ‌స్థాన్‌లోని పుష్క‌ర్‌లో కొలువై ఉంది. వివాహిత పురుషులకు ఈ ఆల‌యంలోకి ప్ర‌వేశం లేదు. బ్రహ్మ దేవుడికి ఉన్న ఏకైక దేవాలయం ఇదే. బ్రహ్మ దేవుడు చేస్తున్న యజ్ఞానికి ఆయన సతీమణి సరస్వతీ దేవి ఆలస్యంగా వస్తుంది. దీంతో యజ్ఞం పూర్తి చేయడం కోసం బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకుంటాడు. దీంతో సరస్వతీ దేవి కోపంతో పెళ్ళైన పురుషులకి ఇక్కడ ప్రవేశం లేదని శపించినట్టు పురాణ కథ ఉంది. వివాహిత పురుషులు గర్భగుడిలోకి వస్తే వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుందని నమ్ముతారు.

సంతోషి మాత ఆలయం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఉన్న సంతోషి మాత ఆలయంలో పురుషులని లోపలికి అనుమతించరు. ఇది సంతోషి దేవికి అంకితం చేయబడిన గుడి. భక్తుల జీవితాల్లో సంతృప్తి కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే శుక్రవారాలు సంతోషిమాత రోజులని పిలుస్తారు. పురాణాల ప్రకారం శుక్రవారం రోజున ఈ ఆలయ శక్తి పెరుగుతుందని అంటారు. ఆనందం, శాంతిని కోరుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి స్త్రీలు ఇక్కడికి వస్తారు. పురుషులని గర్భగుడిలోకి అనుమతించరు.