• Telugu News
  • /Trending

Mother Suprise Son Girlfriend: మెట్రో స్టేషన్ లో గర్ల్ ఫ్రెండ్ తో కొడుకు.. తల్లి చేసిన పని వైరల్ !

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న కొడుకును పట్టుకున్న తల్లి అక్కడికక్కడే ఎంగేజ్మెంట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | ట్రెండింగ్ | Feb 07, 2026, 7:14 pm IST
Read Time: 3 mins
Mother Suprise Son Girlfriend: మెట్రో స్టేషన్ లో గర్ల్ ఫ్రెండ్ తో కొడుకు.. తల్లి చేసిన పని వైరల్ !

విధాత : తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య ప్రేమాయణాలు..అక్రమ సంబంధాలు కొనసాగించడం వంటి విచ్చలవిడితనం నేటి తరం యువతలో పెరిగిపోయింది. అయితే తనకు తెలియకుండా ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్న కొడుకు నిర్వాకాన్ని గమనించిన ఓ తల్లి చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది.

ఢిల్లీ మెట్రో స్టేషన్ లో గర్ల్ ఫ్రెండ్ తో ముచ్చటలాడుతున్న కొడుకు భాగోతాన్ని పసిగట్టిన తల్లి ఆకస్మికంగా వారి ముందు ఎంటర్ ఇచ్చింది. అంతేనా అక్కడికక్కడే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ చేసి వీడియో రికార్డు చేసింది అబ్బాయి తల్లి. ఇకపై రహస్యంగా కలవాల్సిన అవసరం లేకుండా.. ఇలాంటి అనైతిక చర్యలతో పరువు పోగొట్టుకోకుండా ఆ తల్లి ఆ ప్రేమ జంటను ఏకం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తల్లి చర్యను సమర్థిస్తూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

అంత ప్రేమగల కుటుంబం, మంచి అత్తగారు లభించినందుకు ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని కొందరు, ఆమె తన కొడుకును సరైన దారిలో పెట్టిందని.. కోడలును కూడా బాగానే చూస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అబ్బాయి బాధపడాల్సింది ఏమి లేదని, అతని నిర్ణయాలను గౌరవించిన తల్లిదండ్రుల గురించి సంతోష పడాలని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

అందుకేనా.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం: బీఆర్ఎస్ కీలక ఆరోపణలు
Telangana Municipal Elections : ‘మధ్యంతర పరీక్ష’గా మారిన మున్సిపోల్స్