Solar Eclipse Effect | ఈ మూడు రాశులపై సూర్యగ్రహణం ఎఫెక్ట్..! 6 నెలల వరకు ఆర్థిక కష్టాలే..!!
Solar Eclipse Effect | ఈ నెల 21న సూర్యగ్రహణం( Solar Eclipse ) ఏర్పడనుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల( Zodiac Signs ) వారికి శుభ ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం ఆరు నెలల వరకు ఆర్థిక కష్టాలు( Financial Problems ) వెంటాడుతాయని చెబుతున్నారు.

Solar Eclipse Effect | ఈ ఆదివారం(సెప్టెంబర్ 21) ఏర్పడబోయే సూర్యగ్రహణం( Solar Eclipse ).. 2025 ఏడాదిలో చిట్టచివరిది. ఈ సూర్యగ్రహణం( Surya Grahan ) మన దేశంలో కనిపించదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి( Virgo ), ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం అన్ని రాశులపై ప్రభావం చూపించనుంది. కానీ ఓ మూడు రాశులకు మాత్రం ఆరు నెలల పాటు గ్రహణం పట్టనుంది. ఈ మూడు రాశుల వారి జీవితాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆరు నెలల వరకు ఆర్థిక కష్టాలు వెంటాడనున్నాయి. కాబట్టి వచ్చే ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ మూడు రాశులు( Zodiac Signs ) ఏంటో తెలుసుకుందాం..
కన్యా రాశి( Virgo )
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఈ ఆదివారం సంభవించబోయే సూర్యగ్రహణం కన్యా రాశిలోనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారిపై ఈ గ్రహణం ఎఫెక్ట్ బలంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం క్షీణించడంతో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కారణంగా తీసుకునే నిర్ణయాల్లో అనేక గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ చిన్న నిర్లక్ష్యం అయినా ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ గ్రహణం మీ బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించేలా అవకాశాన్ని ఇస్తుంది.
ధనుస్సు రాశి( Sagittarius )
ఆదివారం ఏర్పడబోయే సూర్యగ్రహణం.. ధనుస్సు రాశి వారి భవిష్యత్, కేరీర్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడంతో.. అతలాకుతలం చేస్తుంది. వీరి జీవితంలో అనేక ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. బాధ కలిగించే విషయాలు నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. వీటికి తోడు ఆర్థిక సమస్యల సుడిగుండంలో పడి ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఆరు నెలల పాటు కష్టపడితే తప్ప ఫలితం లభించదు. ఫలితం కోసం ఓపికగా ఉండాలి.
మీన రాశి( Pisces )
ఈ సూర్య గ్రహణం మీన రాశి వారిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి మధ్య అపార్థాలు ఏర్పడి.. ఆర్థిక సమస్యలకు దారి తీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇతరులతో వాదించకుండా శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నించడం మంచిది. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రారంభించండి. లేదంటే ఆర్థిక కష్టాలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మీన రాశి వారికి ఈ ఆరు నెలల పాటు ఓపిక చాలా అవసరం. ఈ సమయం ఈ రాశి వారి సహనాన్ని, సంబంధాలను పరీక్షిస్తుంది.