గురువారం ఈ మంత్రం జ‌పిస్తే అప్పులన్నీ మాయం..!

గురు దోషం ఉన్న‌వారు ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు. డ‌బ్బు స‌మ‌స్య‌లు నెల‌కొని ఉంటే గురువారం నాడు రాఘ‌వేంద్ర స్వామిని పూజిస్తే త‌ప్ప‌కుండా క‌ష్టాలు తొల‌గిపోతాయ‌నేది పండితుల న‌మ్మ‌కం.

గురువారం ఈ మంత్రం జ‌పిస్తే అప్పులన్నీ మాయం..!

హిందూ సంప్ర‌దాయంలో ప్ర‌తి రోజు ఏదో ఒక దేవుడిని పూజిస్తుంటాం. దేవుళ్ల‌ను పూజిస్తూ త‌మ ఆర్థిక క‌ష్టాల‌ను తొల‌గించాల‌ని ప్రార్థిస్తుంటాం. ఒక వేళ అనుకున్న‌ట్టు ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోతే.. మొక్కులు చెల్లించుకుంటాం. అయితే గురు దోషం ఉన్న‌వారు ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు. డ‌బ్బు స‌మ‌స్య‌లు నెల‌కొని ఉంటే గురువారం నాడు రాఘ‌వేంద్ర స్వామిని పూజిస్తే త‌ప్ప‌కుండా క‌ష్టాలు తొల‌గిపోతాయ‌నేది పండితుల న‌మ్మ‌కం.

ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి..

గురువారం తెల్ల‌వారుజామునే మేల్కొని అభ్యంగ‌న స్నానం చేయాలి. ఆ త‌ర్వాత తుల‌సి మాల తీసుకుని, గురు మంత్రం ‘ఓం బృహస్పేతే నమః’ 108 సార్లు , రాయ మంత్రం ‘శ్రీ గురు రాఘవేంద్రాయ నమఃస జ‌పించాలి. ఈ మంత్రాలు ఆర్థిక స్థితిని బలపరుస్తాయి. జీవితంలో ఆనందం , శ్రేయస్సును తెస్తుంది.

ఈ రంగు వ‌స్త్రాలు ధ‌రించండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే డబ్బు సమస్య కూడా తొలగిపోతుంది. పసుపు విష్ణువుకు ఇష్టమైన రంగు కాబట్టి, ఈ రోజున మీరు విష్ణువుకు పసుపు మిఠాయిలు సమర్పించాలి.

అప్పులు చేయ‌కూడ‌దు..

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు గురువారం అప్పులు చేయ‌కూడ‌దు. ఎందుకంటే అలా చేయడం ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు. ఇది మీ డబ్బు సమస్యలను మాత్రమే పెంచుతుంది, వాటిని తగ్గించదు.

నైవేద్యం ఏం పెట్టాలంటే..

విష్ణువును పూజించేటప్పుడు అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. దీనితో పాటు శనగలు , బెల్లం సమర్పించండి. శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి ఇది సులభమైన మార్గం.