Tiruchanur Sri Padmavathi Ammavari Brahmotsavam | తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17న ప్రారంభమై 25 వరకు జరుగనున్నాయి. వాహనసేవల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
 
                                    
            విధాత: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఏటా నవంబర్ లో కార్తీక మాసంలో నిర్వహించే వార్షిబ బ్రహ్మోత్సవాలు 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు నవంబర్ 25వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొనసాగనున్నాయి. విశేష ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, నవంబర్ 16న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు:
17-11-2025 (సోమవారం) ఉదయం: ధ్వజారోహణం( ధనుర్ లగ్నం), రాత్రి చిన్నశేషవాహనం
18-11-2025( మంగళ వారం) ఉదయం: పెద్దశేషవాహనం , రాత్రి హంసవాహనం
19-11-2025(బుధవారం) ఉదయం: ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనం
20-11-2025 (గురువారం) ఉదయం: కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం
21 -11-2025(శుక్ర వారం) ఉదయం: పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం
22-11-2025(శనివారం) ఉదయం: సర్వభూపాలవాహనం, సా: స్వర్ణరథం, గరుడవాహనం
23-11-2025(ఆదివారం) ఉదయం: సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
24-11-2025 (సోమవారం) ఉదయం : రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
25-11-2025 (మంగళవారం) ఉదయం: పంచమీతీర్థం , రాత్రి ధ్వజావరోహణం.
26-11-2025 (బుధవారం) ఉదయం : పుష్పయాగం.
నవంబర్ 07, 14, 28 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో అమ్మవారు భక్తులకు ఊరేగింపుగా దర్శనమిస్తారు.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram