నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఉన్నతాధికారుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సంతానం పురోగతి పట్ల సంతృప్తితో ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. నమ్మిన వారి కారణంగా మోసపోయే ప్రమాదముంది. సన్నిహితుల సహకారంతో ఆపదల నుంచి బయట పడతారు. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను పొందుతారు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండవచ్చు. వ్యాపారులకు గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. లక్ష్మీకటాక్షంతో సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని విజయాలను అందుకుంటారు. దైవబలం అండగా ఉంటుంది. ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనిలో మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల
ఈ రోజు ఫలవంతమైనదిగా ఉంటుంది. ఆత్మబలంతో పనిచేసి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలతో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా, అదృష్టకరంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు పూర్తి సంతోషం వ్యక్తం చేస్తారు. ఏ పని మొదలు పెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. ఆవేశానికి లోను కావద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది.
ధనుస్సు
ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేక పోతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు మానసికంగా కుంగదీస్తాయి. ఉద్యోగంలో కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం ఏమంత అనుకూలంగా ఉండదు. అనారోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైన వివాదాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. వృత్తి వ్యాపారాలలో గొప్ప శుభ యోగాలున్నాయి. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడం ఆనందాన్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోవద్దు. పట్టుదలతో ముందుకు సాగితేనే విజయం ఉంటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే కఠోరమైన కృషి అవసరమని గుర్తిస్తారు. సృజనాత్మకంగా వ్యవహరించి మీకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.