Jaydeep Gohil Underwater Stunts | నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్

నీటి అడుగున గాలి పీల్చకుండా హ్యూమన్ పెండ్యులంలా విన్యాసాలు చేసిన జైదీప్ గోహిల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Jaydeep Gohil Underwater Stunts | నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్

విధాత : నీటి అడుగున తెలియాడుతు విన్యాసాలు చేసిన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. నీటి అడుగున అత్యంత క్లిష్టమైన, నీటిపై తేలే నియంత్రణ పాటిస్తూ, గాలి పీల్చకుండా ఊయల ఊగుతున్నట్లు చేసిన ‘హ్యూమన్ పెండ్యులం’ విన్యాసాన్ని జైదీప్ గోహిల్ ప్రదర్శించారు.
ఈ భారతీయ సూపర్ స్టార్ నీటిపై సంపూర్ణ నియంత్రణతో చేసిన ఈ అద్భుత ఫీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో నెట్టింటా దూసుకపోతుంది.

ప్రాచీన కాలం నుంచి యోగాలో భాగంగా జలస్తంభన విద్య, నీటిపై తెలియాడటం, నడవటం వంటి విన్యాసాలు అడపదడపా అక్కడక్కడా వెలుగు చూశాయి. అయితే కాలక్రమేణా వాటి సాధకులు, ప్రదర్శకులు అంతరించిపోతున్న తరుణంలో జైదీప్ గోహిల్ చేసిన ఈ విన్యాసం అందరిని విస్మయ పరుస్తుంది.

ఇవి కూడా చదవండి :

Nampally Fire Accident : నాంపల్లి ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
Telangana Cabinet Expansion | మున్సిపోల్స్‌ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!