Anirudh Reddy| తెలంగాణలో సారా దుకాణాలు ప్రారంభించాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలని కోరుతానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్ చాట్ లో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశంలో బాంబు పేలుస్తానంటూ చెప్పారు.
విధాత, హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలని కోరుతానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్ చాట్ లో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశంలో బాంబు పేలుస్తానంటూ చెప్పారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్ లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను అని, తెలంగాణ రాష్టంలో సారా దుకాణాలు ప్రారంభించాలని కోరుతాను అని వెల్లడించారు .
సారా తాగినోళ్లు 110 ఏండ్లు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏండ్లకే చనిపోతున్నారు అని, సైంటిఫిక్ గా సారా ఆరోగ్యానికి హాని కరం కాదు అని తెలిపారు. ఇటీవల కొన్ని రాష్టాలు సారా దుకాణాలు ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలు నడుపుతున్నాయని పేర్కొన్నారు. అస్సలు తెలంగాణ రాష్టంలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేసారు అన్నదానిపై.. క్లారిటీ రావాలి అని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram