Tollywood | ముదురుతున్న డ్రగ్స్ వివాదం … ఎమ్మెల్యేపై ఫుల్ సీరియస్ అవుతున్న టాలీవుడ్ ప్రముఖులు
Tollywood | సినీ పరిశ్రమ, మాదకద్రవ్యాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ నాయకులు, సినీ వర్గాల మధ్య మాటల యుద్ధంగా మారిన ఈ వివాదం ఎటు దారితీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Tollywood | సినీ పరిశ్రమ, మాదకద్రవ్యాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ నాయకులు, సినీ వర్గాల మధ్య మాటల యుద్ధంగా మారిన ఈ వివాదం ఎటు దారితీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెరపై నటీనటులు మద్యం సేవించే సన్నివేశాలను చూపిస్తే వారిని హీరోలుగా చూస్తున్నారని, అదే విషయాన్ని రాజకీయ నాయకులు ప్రస్తావిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు.
సినిమాల్లో ఆల్కహాల్ సీన్స్ పూర్తిగా నిషేధించాలని, సెన్సార్ బోర్డు వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రతి 90 రోజులకు ఒకసారి నటీనటులందరికీ డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని సూచించారు. ఆ టెస్ట్ రిపోర్ట్ సమర్పించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే వారు డ్రగ్స్ వాడుతున్నట్లే భావించాలని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ సమస్య కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఈ దందా జరుగుతోందని గుర్తుచేశారు. కేవలం సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
అలాగే రాజకీయ నాయకుల్లో డ్రగ్స్ వాడకం లేదని ఎవరు చెప్పగలరని ప్రశ్నిస్తూ, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, అలాగే నందమూరి బాలకృష్ణ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు. ఇలాంటి సన్నివేశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన వాదించారు.
ప్రస్తుతం ఈ వివాదం రాజకీయాలు vs టాలీవుడ్‌గా మారింది. ఒకవైపు డ్రగ్స్ నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని రాజకీయ వర్గాలు చెబుతుంటే, మరోవైపు ఒకే రంగాన్ని టార్గెట్ చేయడం సరైంది కాదని సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి డ్రగ్స్ సమస్యను సమగ్రంగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నప్పటికీ, దీనిని ఒకే రంగానికి పరిమితం చేయడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ జోరుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram