Congress, BJP Credit Battle | వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకానికి గ్రీన్ సిగ్నల్.. కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం మంజూరు తమ పార్టీ గొప్పదనమంటే తమ ప్రభుత్వ గొప్పదనమంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంబురాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ పథకానికి ఆమోదం లభించిందంటూ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు పూలాభిషేకం చేసి కృతజ్క్షతలు తెలియజేశారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం మంజూరులో షయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఈ ఘనత దక్కాలంటూ మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పనిలో పనిగా ఇంత పెద్ద పనిని గత ప్రభుత్వాలు చేయలేకపోయాయంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ మౌనంతో ఉంది.
- పాలాభిషేకాలూ, పూలాభిషేకాలతో ఇరుపార్టీల పోటీ
- రూ. 5257.20 కోట్లలో కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా
- గతంలో రూ.4170 కోట్లతో పథకానికి ప్రతిపాదన
- డీపీఆర్ రూపకల్పనతో పెరిగిన అదనపు వ్యయం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Congress, BJP Credit Battle | తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్టుమెంట్ రూ.5257.20 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతిని మంజూరు చేస్తూ 7వ తేదీ రాత్రి జీవో నెంబర్ 322 జారీ చేసిన నేపథ్యంలో పొలిటికల్ క్రెడిట్ వార్ ప్రారంభమైంది. ఈ పథకం తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ ఫలితమంటూ పోటీలు పడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదంతా తమ పార్టీ గొప్పదనమంటూ ప్రచారాన్ని ప్రారంభించారు.
వరంగల్ సిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకంలో కేంద్రం అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద 25శాతం, రాష్ట్రం 25 శాతం వాటా నిధులు సమకూర్చుతాయి. మిగిలిన 50శాతం నిధులను విదేశీ ఆర్ధిక సహకారం కింద సమకూర్చుకునే దిశగా ప్రణాళిక రూపొందించారు. వరంగల్ నగర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకానికి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 4170 కోట్ల ప్రాథమిక అంచనాతో ఆమోదం తెలియజేసింది. తాజాగా ప్రాజెక్టు డీపీఆర్ తర్వాత పెరిగిన నిధులతో కలిపి 5257. 20 కోట్ల నిధులకు చేరింది.
కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ సంబురాలు
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం మంజూరు తమ పార్టీ గొప్పదనమంటే తమ ప్రభుత్వ గొప్పదనమంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంబురాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ పథకానికి ఆమోదం లభించిందంటూ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు పూలాభిషేకం చేసి కృతజ్క్షతలు తెలియజేశారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం మంజూరులో షయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఈ ఘనత దక్కాలంటూ మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పనిలో పనిగా ఇంత పెద్ద పనిని గత ప్రభుత్వాలు చేయలేకపోయాయంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ మౌనంతో ఉంది.
అభివృద్ధి పై విపక్షాలకు సవాల్: కాంగ్రెస్
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే వరంగల్ అభివృద్ధికి చేస్తున్న కృషి పై చర్చకు సిద్ధమంటూ ప్రతిపక్షాలకు కాంగ్రెస్ నాయకులు సవాల్ చేశారు. ఈ భారీ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు మారుతాయని మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి చెప్పారు. గత పాలకులు రాజకీయ స్వలాభం కోసం తప్ప అభివృద్ధి పట్టించుకోలేదని, ప్రచార ఆర్భాలకు పరిమితమయ్యారంటూ బీఆర్ఎస్ ను విమర్శించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పనులు ప్రారంభిస్తే వాటిని చూసి ఇతర పార్టీలు పాలాభిషేకాలు చేసుకోవడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు.
వరంగల్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక నజర్: బీజేపీ
వరంగల్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ భారీగా నిధులు కేటాయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. కేంద్రం భారీగా నిధులు ఇస్తున్న ఖర్చు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ లో భాగంగా అనేక నిధులు ఇచ్చి నగరం రూపురేఖలు మార్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు తప్ప అభివృద్ధి చేసింది లేదని విమర్శించారు. వరంగల్ ఇప్పటివరకు అభివృద్ధి చెందిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్ తదితరులు ఉన్నారు.
పొలిటికల్ క్రెడిట్‌కు ప్రాధాన్యం
ప్రస్తుతం పథకమేదైనా పొలిటికల్ క్రెడిట్ పొందడం ప్రధానంగా మారింది. గతంలో నిధులు మంజూరు చేస్తే ప్రజాప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేసేవారు. కొంతకాలంగా పథకంలో వాటాలను బట్టి కేంద్రం, రాష్ట్రం అంటూ విడదీసి కేంద్రం వాటా ఉంటే బీజేపీ, రాష్ట్రం వాటా ఉంటే స్థానిక అధికార పార్టీలు క్రెడిట్ వార్ కోసం పోటీలు పడటం పరిపాటిగా మారింది. మధ్యలో ఆ సమస్య కోసం ఆందోళనలు చేపట్టిన పార్టీలు తమ పోరాట ఫలితమే అంటూ చెప్పుకోవడం రివాజుగా మారింది.
Read Also |
Anirudh Reddy| తెలంగాణలో సారా దుకాణాలు ప్రారంభించాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Salary Controversy | తెలంగాణలో జీతాల లొల్లి… స్వీపర్‌కు రూ.2 లక్షలు.. ఎస్ఈకి రూ.7 లక్షలు
IRCTC | వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram