Nampally Fire Accident : నాంపల్లి ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లిలో అగ్నిప్రళయం! ఫర్నిచర్ దుకాణంలో చెలరేగిన మంటలు.. భవనంలో చిక్కుకున్న ఆరుగురు. రంగంలోకి ఫైర్ రోబో. సిపి సజ్జనార్ పర్యవేక్షణలో సహాయక చర్యలు..

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jan 24, 2026, 7:42 pm IST
Read Time: 2 mins
Nampally Fire Accident : నాంపల్లి ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

విధాత,హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవించి భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు, మరో ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారోనంటూ భవనం భయట తల్లిదండ్రులు రోధిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.

హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రోబోను భవనంలోకి పంపి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి :

Horse Playing In Ocean : సముద్రపు అలలపై గుర్రం సయ్యాట..వీడియో చూస్తే పులకింత
Telangana Cabinet Expansion | మున్సిపోల్స్‌ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!