Raja Saab | ‘రాజాసాబ్’ భారీ అంచనాలకి బ్రేక్… బాక్సాఫీస్ నుంచి ఓటీటీ వరకు నిరాశే!
Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘ది రాజాసాబ్’ అభిమానుల అంచనాలను తీవ్రంగా నిరాశపరిచింది. విడుదలకు ముందు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, పాన్ ఇండియా స్థాయిలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి.
Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘ది రాజాసాబ్’ అభిమానుల అంచనాలను తీవ్రంగా నిరాశపరిచింది. విడుదలకు ముందు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, పాన్ ఇండియా స్థాయిలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మిక్స్‌డ్ నుంచి నెగిటివ్ టాక్ రావడంతో ఆ అంచనాలు నీరుగారిపోయాయి. భారీ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా నిర్మాతకు ఊహించిన స్థాయిలో లాభాలు కాకుండా, గణనీయమైన నష్టాలను మిగిల్చినట్టుగా ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
థియేట్రికల్ బిజినెస్ పరంగా పెద్దగా రిస్క్ లేకపోయినా, ఓటీటీ ద్వారా భారీ మొత్తంలో ఆదాయం వస్తుందనే నమ్మకంతో నిర్మాత ఖర్చు విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లారని సమాచారం. కానీ ఇప్పుడు ఓటీటీ మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో, పెట్టిన మొత్తంలో కనీసం సగం కూడా రికవర్ కాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభాస్ తనవంతుగా నిర్మాతకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ‘రాజాసాబ్’ ఓటీటీ బిజినెస్‌పై వస్తున్న వార్తలు అభిమానులకు మరింత షాక్ ఇస్తున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటించినప్పటికీ, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ సుమారు రూ.80 కోట్లకు మాత్రమే దక్కించుకున్నట్టుగా సమాచారం. ఒకప్పుడు ప్రభాస్ సినిమాలకు ఓటీటీ సంస్థలు వందల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు పోటీ పడిన పరిస్థితిని చూస్తే, ఇది నిజంగా దారుణమైన పతనమనే చెప్పాలి. ‘కల్కి’, ‘సలార్’ వంటి ప్రభాస్ గత చిత్రాలతో పోల్చితే ‘రాజాసాబ్’ ఓటీటీ బిజినెస్ సగంలో సగం కూడా రాబట్టలేకపోయిందన్నది ట్రేడ్ వర్గాల విశ్లేషణ.
ఇది ఒక్క ‘రాజాసాబ్’ సమస్య మాత్రమే కాదని, మొత్తం ఓటీటీ మార్కెట్ ప్రస్తుతం డౌన్‌ఫేజ్‌లో ఉందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు మూడు నెలలుగా డిజిటల్ ప్లాట్‌ఫాంలు కొత్త సినిమాలపై పెట్టుబడులు తగ్గించుకుంటూ వస్తున్నాయి. హీరో క్రేజ్, స్టార్‌డమ్‌ను నమ్ముకుని భారీ మొత్తాలు చెల్లించే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే ‘రాజాసాబ్’ లాంటి భారీ సినిమా కూడా కేవలం రూ.80 కోట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
థియేట్రికల్ పరంగా చూస్తే, మిక్స్‌డ్ టాక్ మధ్యలోనూ ప్రభాస్‌కు ఉన్న మార్కెట్, ఫ్యాన్ బేస్ కారణంగా సినిమా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్టుగా అంచనా. అయితే అదే సమయంలో విడుదలైన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ఇతర సంక్రాంతి చిత్రాల ముందు ‘రాజాసాబ్’ నిలబడలేకపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపించింది. థియేట్రికల్ రన్ కూడా వేగంగా ముగిసినట్టుగా తెలుస్తోంది. సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత జియో హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద ఓటీటీ సంస్థలు ఈ సినిమాను తీసుకుని ఉంటే నిర్మాతకు మరింత భారీ మొత్తం దక్కేదేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓటీటీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తులో సినిమాల బడ్జెట్లు తగ్గే అవకాశం ఉందని, హీరోల పారితోషికాలపై కూడా ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపై నిర్మాతలు ఎక్కువగా థియేట్రికల్ రెవెన్యూనే ప్రధాన ఆధారంగా చేసుకుని సినిమాలు నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందని, ఓటీటీ మార్కెట్ మళ్లీ పాత రోజులకు చేరుతుందా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram