Vastu Tips | అద్దానికి కూడా వాస్తు నియమాలున్నాయి..! అవేంటో తెలుసా..?
Vastu Tips | వాస్తు( Vastu ) ప్రకారం కొత్త ఇల్లును( New House ) నిర్మించుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉంచే ప్రతి వస్తువును కూడా వాస్తు నియమాలకు( Vastu Tips ) అనుసరించి ఉంచాలి. అప్పుడే ఆ ఇంట్లో సానుకూల శక్తి( Positive Energy ) ఏర్పడుతుంది.

Vastu Tips | వాస్తు( Vastu ) ప్రకారం కొత్త ఇల్లును( New House ) నిర్మించుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉంచే ప్రతి వస్తువును కూడా వాస్తు నియమాలకు( Vastu Tips ) అనుసరించి ఉంచాలి. అప్పుడే ఆ ఇంట్లో సానుకూల శక్తి( Positive Energy ) ఏర్పడుతుంది. ఏ పని చేసినా ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది. మరి ఇంట్లో ఉంచే అద్దానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు. సరైన స్థలంలో ఉంచిన అద్దం( Mirror ) మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందించడంతో పాటు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ వెలుగులు నింపుతుందని పండితులు పేర్కొన్నారు. అందుకే అద్దాన్ని తప్పుడు స్థానంలో ఉంచొద్దని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఆ రెండు దిశల్లోనే అద్దం ఉంచాలి..
అద్దం( Mirror ) లేని ఇల్లు ఉండనే ఉండదు. హాల్( Hall ), బెడ్రూం( Bed Room )లో తప్పనిసరిగా అద్దాలను ఉంచుతారు. ఈ అద్దాలను ఉంచితే ఉంచారు కానీ.. దాన్ని సరైన దిశలో అమర్చాలి. లేకపోతే సమస్యలు ఉత్పన్నమై కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అద్దంను కాంతి వచ్చే దిశలలో.. అంటే ఇంటి తూర్పు( East ) లేదా ఉత్తర( North ) దిశలో ఉన్న గోడలపై ఉంచడం మంచిది. ఎందుకంటే ఈ దిశలు సానుకూల శక్తి , కాంతికి సంబంధించినవి. కాబట్టి ఈ రెండు దిశల్లోనే అద్దం పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.
అద్దంతో వాస్తు దోషాలు ఇలా తొలగించుకోవచ్చు..
– ఇల్లు లేదా వ్యాపార స్థలంలోని వాయువ్య మూల కత్తిరించబడి ఉంటే.. ఆ భాగం ఉత్తర గోడపై 4 అడుగుల వెడల్పు గల అద్దం ఉంచండి. ఇలా చేయడం వాస్తు దోషాన్ని తొలగిస్తుంది.
– ఈశాన్య మూల కత్తిరించినట్లు ఉంటే ఉత్తర గోడపై కత్తిరించిన భాగం లోపల అద్దం ఉంచండి.
– ఫ్లాట్ లిఫ్ట్ లేదా మెట్ల దగ్గర ఉంటే..ఇంటి ప్రధాన తలుపు మీద అష్టభుజాకార అద్దం పెట్టాలి.
– ఇంటి వెనుక లేదా ఫ్లాట్ వెనుక జాతీయ రహదారి ఉంటే ఇంటి వెనుక అష్టభుజి అద్దం ఏర్పాటు చేసుకోండి.
– పడకగదిలో అద్దాలను ఏర్పాటు చేసుకోవద్దు. అంటే ఆ గదిలో అద్దం పెట్టడం సరికాదు.
– భోజనాల గదిలో అద్దం పెట్టడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ఎల్లప్పుడూ ఆహారం, సంపద సమృద్ధిగా ఉంటుంది.
– ఇంటి పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే ఎక్కువగా తెరిచి లేదా వెడల్పుగా ఉంటే.. తూర్పు గోడపై అద్దం ఉంచడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.