Venus Enters Gemini | ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. అంతేకాదు వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండాలని కూడా కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ ఐదు రాశుల వారికి మాత్రం సాధ్యమవుతుందని జ్యోతిష్య పండితులు చెబతున్నారు. ఎందుకంటే మే 14వ తేదీన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గురువారం నుంచి జూన్ 8వ తేదీ వరకు ఇదే రాశిలో సంచారం చేయనున్నారు. దీంతో ఈ ఐదు రాశుల వారికి అపారమైన సంపద, విలాసవంతమైన జీవితం, వైవాహిక జీవితంలో ఆనందం కలగనున్నాయి. మరి ఆ ఐదు రాశులేవో చూద్దాం.
వృషభ రాశి ( Taurus )
శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసొచ్చే అవకాశం ఉంది. సంపదకు మార్గాలు తెరుచుకుంటాయి. అప్పులన్నీ తొలగిపోతాయి. పని ప్రదేశంలో ఈ రాశి వారికి ప్రశంసలు అందుతాయి. అధికారులు మెచ్చుకుంటారు. అంతేకాదు పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి ( Cancer)
కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను తీసుకురానుంది ఈ సంచారం. ఈ రాశి వారికి అమాంతం ఆదాయం పెరగనుంది. కుటుంబ సభ్యుల బంధాలు బలోపేతం అవుతాయి. స్నేహితులు మరింత అన్యోన్యంగా ఉంటారు. పెట్టుబడులు రాబడులను తీసుకువస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సింహ రాశి (Leo)
మే 14 నుంచి జూన్ 8వ తేదీ వరకు సింహ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సమయం. ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ పిల్లలు విజయం సాధిస్తారు. సహోద్యోగుల మద్దతుతో లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తయి.. లాభపడుతారు.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారు.. వృత్తి, వ్యాపార రంగాలను ప్రారంభించొచ్చు. ఎందుకంటే ఇది వారికి శుభసమయం. ఉద్యోగం మారాలనుకునే వారికి అనుకూల సమయం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి కూడా ఆర్థిక , కెరీర్ ప్రయోజనాలు చేకూరనున్నాయి. శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి ఊహించిన దానికంటే మెరుగైన విద్యా ఫలితాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉద్యోగావకాశాలు లభించవచ్చు. మీ సామర్థ్యాల వల్ల మీ కీర్తి పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి.
