ఆగ‌స్టు 4 నుంచి 10 వ‌ర‌కు రాశిఫ‌లాలు.. ఆ రాశుల వారికి వివాహం నిశ్చ‌యం కావొచ్చు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఆగ‌స్టు 4 నుంచి 10 వ‌ర‌కు రాశిఫ‌లాలు.. ఆ రాశుల వారికి వివాహం నిశ్చ‌యం కావొచ్చు..!

మేషం

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారస్థులు ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో తెలివిగా, ముందుచూపుతో వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. వారం మధ్యలో కొన్ని సానుకూల వార్తలు అందుతాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించడంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నా అధిగమిస్తారు. సమాజంలో గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భూమి, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ వారం విశేషమైన యోగం కలుగబోతోంది. ఇప్పటివరకు జీవితంలో అనుభవించిన అన్ని కష్టాలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో లక్ష్య సాధనకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది. గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా వాయిదా పడిన ప్రణాళికలు ఆకస్మికంగా ముందుకు సాగుతాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కీలకమైన విషయాలలో సానుకూల నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన విజయాలు పొందాలంటే సోమరితనాన్ని అధిగమించాలి. కష్టపడితే తప్ప విజయాలు రావన్న సంగతి గుర్తించాలి.

సింహం

సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాహసోపేతమైన విజయాలు సాధిస్తారు. ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి అంశాలకు అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబలో శుభకార్యాలు జరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు.

కన్య

కన్యరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పోటీతత్త్వం పెరుగుతుంది. స్వల్ప విజయాలు మాత్రమే ఉండవచ్చు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. ఒత్తిడికి లోనవుతారు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తప్పకుండా పాటించాలి. క్రీడా రంగం వారు గొప్ప విజయాలను అందుకుంటారు. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం.

తుల

తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే సమయం నష్టం, ధన నష్టం రెండూ ఉంటాయి. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారస్థులు రుణాల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. రక్తసంబంధీకుల మధ్య తలెత్తిన భూ గృహ వివాదాలు కోర్టు వెలుపల పరిష్కారం ఉత్తమం. తీవ్ర అనారోగ్య సమస్యలతో చికాకు కలగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. కుటుంబంలో శాంతి కోసం తీవ్ర కృషి అవసరం.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ వారం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీలు, పదోన్నతులు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అదనపు రాబడి సమకూరుతుంది. పొదుపు పథకాలలో గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి సత్ఫలితాలు పొందుతారు. పెండింగ్‌ కోర్టు కేసుల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. వ్యాపారస్థులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్ధిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మకరం

మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తీవ్రమైన పోటీ, సవాళ్లు ఉన్నప్పటికినీ అధిగమిస్తారు. సరైన సమయంలో సరైన కృషితో అఖండ విజయాలను సాధిస్తారు. వ్యాపారస్థులు మంచి లాభాలను గడిస్తారు. ఇంటికి బంధువులు రావడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్థులు సకాలంలో అన్ని పనులు పూర్తిచేసి, పదోన్నతులు ఆర్థిక లాభాలు పొందుతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారు పనిలో ఎదురైనా సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ముందుకెళ్తే మంచిది. మీ ప్రతిభతో ఎలాంటి అవరోధాలనైనా అవలీలగా ఎదుర్కొంటారు. దైవబలం అండగా ఉంది. విద్యార్థులు తీవ్రమైన కృషి పట్టుదలతో మాత్రమే విజయాలను పొందగలరు. శత్రువులు పొంచి ఉన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది.

మీనం

మీన రాశి వారికి రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపార విస్తరణ చేయాలనుకునేవారికి శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగస్థులు కోరుకున్న ప్రమోషన్ పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మునుపెన్నడూ లేనంతగా ఆదాయం వృద్ధి చెందుతుంది.