Lord Hanuman | మంగళ, శనివారాల్లోనే హనుమంతుడిని ఎందుకు పూజిస్తారు..?
Lord Hanuman | హిందూ సంప్రదాయం( Hindu Tradition )లో ఒక్కో రోజు ఒక్కో దేవుడి( Lord )కి పూజలు( Puja ) చేస్తుంటారు. ఇక ప్రతి మంగళవారం( Tuesday ) హనుమంతుడికి పూజలు చేస్తారు. అయితే గ్రహ దోషాలతో బాధపడేవారు.. ప్రత్యేకించి ఆంజనేయ స్వామి( Lord Hanuman ) వారిని మంగళవారం తప్పక పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
Lord Hanuman | హిందూ సంప్రదాయం( Hindu Tradition )లో ఒక్కో రోజు ఒక్కో దేవుడి( Lord )కి పూజలు( Puja ) చేస్తుంటారు. ఇక ప్రతి మంగళవారం( Tuesday ) హనుమంతుడికి పూజలు చేస్తారు. శనివారం( Saturday ) కూడా ఆంజనేయస్వామి( Lord Hanuman )కి పూజలు చేసి, కోరికలు కోరుకుంటాం. అయితే గ్రహ దోషాలతో బాధపడేవారు.. ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారిని మంగళవారం తప్పక పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఇక శనివారం పూజించినా పర్వాలేదని చెబుతన్నారు. ఈ కారణాల వల్లే మన సంస్కృతిలో మంగళవారానికి అదే విధంగా శనివారానికి హనుమంతుని విషయంలో ప్రత్యేక స్థానం ఉంది.
హనుమాన్‌ను మంగళ, శనివారాల్లో పూజించడం వల్ల లాభాలు ఇవే..
ఆంజనేయ స్వామి చైత్రమాస శుద్ధ పూర్ణిమ రోజున జన్మించారు. స్వామివారిని మంగళ మూర్తి అని కూడా పిలుస్తూ ఉంటారు. మంగళమూర్తి అంటే సంతోషాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అందుకే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు.
సాధారణంగా అంగారక గ్రహం లేదా కుజ గ్రహం ఎరుపువర్ణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి స్వామివారి ధరించేటువంటి సింధూరం కూడా అటువంటి వర్ణమునే కలిగి ఉండడం ఇక్కడ విశేషం.
గ్రహాల వల్ల ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు హనుమంతుడిని ప్రత్యేకంగా మంగళ, శనివారాల్లో పూజించడంతో గ్రహాదోషాలు తొలగిపోతాయట. అందుకే మన సంస్కృతిలో మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు ఉన్నాయి. నిజమైన భక్తితో స్వామివారిని మంగళవారం నాడు లేదా శనివారం నాడు అర్చించే భక్తులకు ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు.
మంగళవారం, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి, తమలపాకులతో ఆకు పూజ చేసి, వడమాల లేదా అప్పాల మాల సమర్పించిన యెడల తప్పక కోరికలు నెరవేరుతాయి. శ్రీ హనుమంతుని భక్తులుగా ఉన్న వారికి నరఘోష, బంధు ఘోష గ్రహ బాధలు తొలగి భూత ప్రేతాది శక్తులు దరిచేరకుండా రక్షణ ఇస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram