AP High Court Jobs | ఏపీ హైకోర్టులో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు నిన్నటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
సెక్షన్ ఆఫీసర్స్ – 5 పోస్టులు
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ – 01
కంప్యూటర్ ఆపరేటర్ – 31
అసిస్టెంట్ లైబ్రేరియన్ – 01
లైబ్రేరియన్ గ్రేడ్ II – 01
యూడీ స్టెనోగ్రాఫర్ – 07
అసిస్టెంట్ – 78
ఎగ్జామినర్ – 27
టైపిస్ట్ – 44
కాపీయిస్ట్ – 34
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50
స్టెనోగ్రాఫర్ – 01
ఆఫీస్ సబార్డినేట్ – 20
అర్హత
పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏడో తరగతి/డిగ్రీ/బీటెక్/లా/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా అవసరం. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు ఉండగా.. 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక పూర్తి చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.20 వేల నుంచి రూ.1.47 లక్షల వరకు జీతం అందిస్తారు.
దరఖాస్తు రుసుము
ఈ పోస్టులకు మార్చి 30వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తు రుసుమును రూ.800గా నిర్ణయించారు. అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.400 చెల్లించాలి.
Read More:
NIC Govt Jobs | రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.1.77 లక్షల జీతం!
10th, ఐటీఐతో ఇండియన్ రైల్వేలో జాబ్స్.. 11,127 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!
