ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, అవసరమైన వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లో 59 శాతం మంది, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెరుగైన ఫలితాలు పొందిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
ఈసారి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలో తొలిసారిగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించబడగం ప్రత్యేకంగా నిలిచింది. ఇది 1.83 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం అందించింది.
ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్‌మెంట్ రాసిన 2,29,034 మందిలో 59% (1,35,435 మంది), సప్లిమెంటరీ రాసిన 1,09,003 మందిలో 39% (42,379 మంది) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో ఇంప్రూవ్‌మెంట్ రాసిన 91,303 మందిలో 53% (48,149 మంది), సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1,02,018 మందిలో 56% (57,327 మంది) విద్యార్థులు విజయం సాధించి తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.
