BSF | బీఎస్ఎఫ్‌లో భారీగా కొలువులు.. 3588 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్
BSF | మీరు పదో తరగతి( Tenth Class ) పాస్ అయ్యారా..? దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా..? అది కూడా సరిహద్దుల్లో సైనికుడి( Jawan )గా పని చేయాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే బోర్డర్ సెక్యూరిటీస్ ఫోర్స్( Border Security Force ) వేల సంఖ్యలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

BSF | బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్( Border Security Force ) వివిధ సెక్టార్లలో 3588 కానిస్టేబుల్స్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్) మేల్ – 3406
కానిస్టేబుల్(ట్రేడ్స్ మెన్) ఫీమేల్ – 182
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఏదైనా ఐటీఐ నుంచి రెండేండ్ల సర్టిఫికెట్ కోర్సు
వయసు : 2025 ఆగస్టు 24వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏండ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు : పురుషులకు ఎత్తు కనీసం 165 సెం.మీ., ఛాతీ 75-80 సెం.మీ., మహిళలకు ఎత్తు 155 సెం.మీ.
ఎంపిక : ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 23
వెబ్‌సైట్ : rectt.bsf.gov.in