PM Internship | స్కిల్స్ పెంచుకోవడానికి సూపర్‌ చాన్స్‌.. పీఎం ఇంటర్న్‌షిప్‌‌లో చేరండిలా..

21 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతీయువకులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పేరిట పథకాన్ని తీసుకొచ్చింది. 10వ, తరగతి , ఐటీఐ, ఇంటర్, పాలిటెక్నిక్ డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారికి అద్భుత అవకాశం. దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇవీ వివరాలు..

PM Internship | స్కిల్స్ పెంచుకోవడానికి సూపర్‌ చాన్స్‌.. పీఎం ఇంటర్న్‌షిప్‌‌లో చేరండిలా..

PM Internship | మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ డెవలప్‌ చేసుకొంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. యువత తమలోని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ అనే పథకాన్ని తెచ్చింది. దేశంలో కీలకమైన 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి ఈ పథకం ద్వారా అవకాశం దక్కుతోంది. ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం కింద అర్హులు ఎవరు?

– 21-24 ఏళ్ల వయస్సున్న వారంతా ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
– దరఖాస్తుదారుడు పూర్తి సమయం ఉద్యోగం చేయవద్దు.
– ఓపెన్ విధానంలో విద్యను అభ్యసిస్తున్నవారు కూడా అర్హులే.
– 10వ, తరగతి , ఐటీఐ, ఇంటర్, పాలిటెక్నిక్ డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి.
– దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించకూడదు.
– దరఖాస్తుదారుడు భారతీయుడై ఉండాలి.

లాభాలు ఏంటి?

– ఇంటర్న్‌షిప్‌‌నకు ఎంపికైన విద్యార్థులకు ఏడాది తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.
– ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో కూడా పనిచేసేందుకు అవకాశం.
– ప్రతి నెల రూ. 5 వేల స్కాలర్ షిప్, రూ. 4500 కేంద్ర ప్రభుత్వం, రూ. 500 సంబంధిత కంపెనీ చెల్లిస్తాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

– పీఎం ఇంటర్న్‌షిప్ అధికారిక వెబ్ సైట్ (pminternship.mca.gov.in)లో యూత్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేస్తే పీఎం ఇంటర్న్‌షిప్ ఆప్షన్‌ కనిపిస్తుంది.
– మీ మొబైల్ నంబర్ (ఆధార్‌తో లింక్ చేసిన నెంబర్ ) ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయాలి
– ఇప్పుడు పాస్ వర్డ్ సెటప్ చేసుకోవాలి.
– ఆ తర్వాత అన్ని వివరాలు సబ్మిట్‌ చేయాలి. అంటే మీ విద్యార్హతలు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలి.
– ఇప్పుడు కరెంట్ స్టేటస్ పై క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ను పూర్తి చేయాలి.
– ఆ తర్వాత ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
– ఇప్పుడు ఇంటర్న్‌షిప్ అవకాశాలపై క్లిక్ చేయాలి.
– మీకు నచ్చినవాటిలో ఐదు ఇంటర్న్‌షిప్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
– అన్ని వివరాలు ఫిల్ చేయాలి.
– సెల్ఫ్ డిక్లరేషన్ చదివి టిక్ చేయాలి.
– ప్రతి ఏటా ఇంటర్న్‌షిప్ కోసం ధరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం గడువును ప్రకటిస్తోంది. దీని ఆధారంగా ఆ లోపుగానే చేసుకోవాలి.

కావాల్సిన డాక్యుమెంట్లు
– ఆధార్ కార్డు
– విద్యార్హతల సర్టిఫికెట్లు
– వయస్సును తెలిపే ఏజ్ సర్టిఫికెట్
– బ్యాంకు పాస్ పుస్తకం
– అధికారిక వెబ్ సైట్ లో కోరిన ఇతర డాక్యుమెంట్లు