MP Kavya | నైపుణ్యాభివృద్ధి పథకాల అమలులో లోపాలు.. పార్లమెంట్‌లో ఎంపీ కావ్య ప్రశ్న

వరంగల్ లో నైపుణ్యాభివృద్ధి పథకాల అమలు తీరుపైన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కింద వరంగల్ జిల్లాలో జరుగుతున్న పనులపై ఎంపీ ప్రశ్నించారు.

MP Kavya | నైపుణ్యాభివృద్ధి పథకాల అమలులో లోపాలు.. పార్లమెంట్‌లో ఎంపీ కావ్య ప్రశ్న

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

వరంగల్ లో నైపుణ్యాభివృద్ధి పథకాల అమలు తీరుపైన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కింద వరంగల్ జిల్లాలో జరుగుతున్న పనులపై ఎంపీ ప్రశ్నించారు. ప్రధానంగా శిక్షణా కేంద్రాల పని తీరు, మహిళలు–ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్లు, పరిశ్రమల అనుసంధానం, ఉద్యోగావకాశాల ఫలితాలపై సమగ్ర వివరాలను ఎంపీ కోరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, “PMKVY ప్రారంభం నుంచి వరంగల్‌లో ఎనిమిది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.

కానీ ప్రస్తుతం అమలులో ఉన్న PMKVY–4.0లో ఒక్క కేంద్రం కూడా పనిచేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు తక్షణ శిక్షణ కోర్సులు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, ఎస్సీ వర్గాల కోసం PMKVY–4.0లో ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోవడం దురదృష్టకరం అని ఎంపీ విమర్శించారు. గతంలో 4,592 మంది ఎస్సీ అభ్యర్థులు శిక్షణ పొందగా 76% సర్టిఫికేషన్, 12,461 మంది మహిళలు శిక్షణ పొందగా 80% సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ, ప్రస్తుత దశలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ డాక్టర్ కావ్య డిమాండ్ చేశారు.

పరిశ్రమలతో ఒప్పందాల ద్వారా అప్రెంటిస్‌షిప్, ఆన్–ది–జాబ్ ట్రైనింగ్ (OJT) వంటి అవకాశాలు ఉన్నప్పటికీ, 2015–2022 మధ్య శిక్షణ పొందిన 15,398 మంది అభ్యర్థుల్లో కేవలం 6,322 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించడంతో ప్లేస్‌మెంట్ రేటు 41%కు పరిమితమైందని ఎంపీ విమర్శించారు. “ప్లేస్‌మెంట్ తర్వాత వేతనవృద్ధి, స్థిరమైన ఉపాధిపై సమర్థవంతమైన ట్రాకింగ్ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ మేరకు ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌధరీ సమాధానం ఇచ్చారు. PMKVY–4.0లో రిజర్వేషన్లేమీ లేవని, కానీ కెరీర్ ఆధారిత OJTపై దృష్టి పెట్టామని తెలిపారు. అయితే డాక్టర్ కావ్య, వరంగల్ సామర్థ్యానికి తగినట్లుగా యువతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో యువతకు నైపుణ్యాలే భవిష్యత్తు అంటూ సమస్య పరిష్కారం కోసం తాను పోరాడుతానని స్పష్టం చేశారు.