Indian IT layoffs | భారత కంపెనీ చట్టాల్లో లొసుగులు.. ఇష్టారాజ్యంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు!
ఒకప్పటి డ్రీమ్ జాబ్.. ఇప్పుడు టెన్షన్ పెడుతున్నది. ఐటీ కొలువుల కోసం తీపి కలలు కన్న యువత.. ఇప్పుడు తమను ఏ క్షణాన జాబ్ నుంచి తీసేస్తారోనని పీడకలలు కంటున్నారు. భారత కార్మిక చట్టాల్లో లొసుగులు కూడా ఐటీ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Indian IT layoffs | సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఒకప్పుడు డ్రీమ్ జాబ్. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇది ఎంతమాత్రమూ భద్రమైనది కాదనే పరిస్థితి నెలకొన్నది. కొవిడ్ తరువాత దేశంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. పొదుపు చర్యల్లో భాగంగా కొన్ని సంస్థలు, సీనియర్లను తొలగించి వారి స్థానంలో జూనియర్లను నియమించుకుంటున్నాయి. కారణం ఏదైతేనేమి ఉద్యోగం ఊడబెరికి పంపించడం ఐటీ కంపెనీల్లో సర్వ సాధారణ చర్యగా మారింది. భారత కార్మిక చట్టాల్లో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని ప్రపంచ టెక్ కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకటి రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చి తీసివేస్తున్నారని 72 శాతం మంది టెక్ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5వ తేదీ మధ్య ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో 1,396 మంది ఉద్యోగులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
Layoffs | రెండు కీలక ప్రాజెక్టులకు మూత.. ‘యాపిల్’లో మరో 600 ఉద్యోగులకు ఉద్వాసన..!
దేశంలో రెండు మూడు దశాబ్ధాలుగా ఐటీ ఉద్యోగం అనేది చదువుకున్న యువతకు ఒక జీవితాశయం. ఐటీ ఉద్యోగం దొరికితే చాలు అనే విధంగా కలలు కన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే బదులు ఐటీ కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఇచ్చేవారు. రెండు మూడేళ్లుగా పలు కంపెనీలు ఆర్థికంగా కుదుపునకు గురవుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో పలు కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకుని, ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో మిడిల్, సీనియర్ గ్రేడ్ స్థాయి ఉద్యోగుల తొలగింపు అనివార్యం అయ్యింది. వీరికి ఇస్తున్న వేతనాలతో మూడింతలు జూనియర్ స్థాయిలో నియామకాలు చేసుకుంటున్నారు.
అమెజాన్ ఉద్యోగుల జీతాల్లో సగం కోత!
ప్రధానంగా అమెజాన్ కంపెనీలో ఒకటి రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చి అకస్మాత్తుగా ఇంటికి పంపిస్తున్నారని సర్వేలో పలువురు వెల్లడించారు. కేవలం 18 శాతం మంది మాత్రమే తమకు ఒక నెల నుంచి మూడు నెలల ముందుగానే సమాచారం ఇస్తున్నారన్నారు. జూమ్ లేదా టీమ్ కాల్స్ ద్వారా తమకు సమాచారం ఇస్తున్నారని 37 శాతం మంది తెలియచేయగా, 23 శాతం మంది ఈ మెయిల్ ద్వారా తెలియచేస్తున్నారని పేర్కొన్నారు. తమకు లాగిన్ చేసుకునే అవకాశం లేకుండా చేసి తొలగిస్తున్నారని 13 శాతం మంది ఉద్యోగులు వెల్లడించారు. కార్మిక చట్టాల్లో వర్క్ మెన్ విభాగం నుంచి ఐటీ, ఐటీ సంబంధిత ఉద్యోగాలు, మేనేజిమెంట్ ఉద్యోగులను మినహాయించడ బహుళ జాతి ఐటీ కంపెనీలకు వరంగా మారిందంటున్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం (ఐడీఏ) ప్రకారం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో నోటీసు పిరియడ్ ఎప్పుడు ఇచ్చినా తీసుకుని ఇంటిముఖం పట్టాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఫలితంగా లక్షలాది మంది వైట్ కాలర్ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం లేకుండా క్రూరంగా ఉద్యోగాలను ఊడబెరుకుతున్నారని, తమను మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారని పలువురు ఐటీ ఉద్యోగులు సర్వేలో వాపోయారు.
Read Also |
Deathbots | ఏఐ ఉపయోగించి ఆత్మలతో మాట్లాడవచ్చునా?
Delhi Blast | ‘ఢిల్లీలో ఏదో జరగబోతోందా?’.. పేలుడుకు ముందు విద్యార్థి పోస్ట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram