RRB ALP Recruitment | ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

RRB ALP Recruitment | ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. అసిస్టెంట్ లోకోపైలట్ (ALP) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

Reported by: Chandram | విద్య - ఉద్యోగం | May 15, 2026, 7:05 am IST
Read Time: 4 mins
RRB ALP Recruitment | ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

RRB ALP Recruitment | ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. అసిస్టెంట్ లోకోపైలట్ (ALP) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.

అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఆర్‌బీ సూచించింది. అభ్యర్థులు www.rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 14వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు సమయంలో ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఆధార్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు అప్లికేషన్‌లో సరిపోవాలని పేర్కొంది. తప్పులు ఏమైనా ఉంటే ముందే సరిచేసుకోవాలని సూచించింది.

ఖాళీల రీజియన్లు

అహ్మాదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గువహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం

అర్హతలు

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2026 జూలై 1వ తేదీ నాటికి వయసు 18-30 మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు ఏడో వేతన సంఘం ప్రకారం లెవల్ 2 పే స్కేల్‌ ఇవ్వనున్నారు. దీని ప్రకారం ప్రాథమికంగా రూ.19,900 చెల్లించనున్నారు. అదనంగా అలవెన్స్‌లు కూడా లభిస్తాయి.

Read More:

Kids Farming Camp | మీ పిల్లలను ఒక్క రోజు రైతులా చూడాలని ఉందా.. వ్యవసాయం నేర్పిస్తున్న ఈ ప్రత్యేక ఫామ్ గురించి తెలుసుకోండి!